నిరుద్యోగులకు తీపికబురు.. త్వరలోనే భారీగా పోలీసు కొలువులు

by Shyam |
నిరుద్యోగులకు తీపికబురు.. త్వరలోనే భారీగా పోలీసు కొలువులు
X

దిశ, వెబ్‌డెస్క్ : ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. పోలీసుల అమర వీరుల దినోత్సవం సందర్భంగా ఆయన విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో పోలీసుల అమర వీరుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విధి నిర్వహణలో అమరులైన పోలీస్ సిబ్బంది వివరాలతో కూడిన అమరులు పుస్తకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. త్వరలోనే భారీగా పోలీసు కొలువులు రానున్నాయని తెలిపారు. అదేవిధంగా 2017 నుంచి బకాయిలు ఉన్న 15 కోట్లు విడుదల చేశామని, భారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నామని ప్రకటన చేశారు. హోమ్ గార్డుల గౌరవ వేతనం పెంచామని,16వేల మంది మహిళా పోలీసులకు శిక్షణ ఇస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పోలీసులకు వీక్లీ ఆఫ్‌లు ప్రకటించామన్నారు.

Next Story

Most Viewed