AUS vs ENG: హ్యారీ బ్రూక్ మెరుపు సెంచరీ ..మూడో వన్డేలో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ ఘనవిజయం

by Maddikunta Saikiran |
AUS vs ENG: హ్యారీ బ్రూక్ మెరుపు సెంచరీ ..మూడో వన్డేలో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ ఘనవిజయం
X

దిశ, వెబ్‌డెస్క్:మంగళవారం చెస్టర్-లీ-స్ట్రీట్‌(Chester-le-Street) వేదికగా ఆస్ట్రేలియా(AUS)తో జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్(ENG) డక్‌వర్త్-లూయిస్(Duckworth-Lewis) ప్రకారం 46 పరుగుల తేడాతో విక్టరీ సాధించింది.దీంతో వన్డేల్లో ఆస్ట్రేలియా 14 వరుస విజయాలకు బ్రేక్ పడింది.ఈ మ్యాచులో ఇంగ్లండ్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది.దీంతో మొదటగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ 50 ఓవర్లో 7 వికెట్ల నష్టానికి 304 పరుగుల భారీ స్కోర్ సాధించింది.ఆసీస్ తరుపున వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ(77 పరుగులు 65 బంతుల్లో),స్టీవ్ స్మిత్(60 పరుగులు 82 బంతుల్లో) రాణించారు. ఇంగ్లండ్ తరుపున జోఫ్రా ఆర్చర్ అత్యధికంగా 2 వికెట్లు పడగొట్టగా, కార్సే,బెతేల్,విల్ జాక్స్,లివింగ్ స్టన్ చెరో ఒక వికెట్ తీశారు.

అనంతరం 305 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లండ్ ఆదిలోనే తడబడింది.11 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి నష్టాల్లో ఉన్న ఆ జట్టును కెప్టెన్ హ్యారీ బ్రూక్(110 పరుగులు 94 బంతుల్లో; 13 ఫోర్లు,2 సిక్సులు),విల్ జాక్స్(84 పరుగులు; 9 ఫోర్లు,1 సిక్సు) ఆదుకున్నారు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్ భాగ్యస్వామ్యానికి 156 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఇంగ్లండ్ 37.4 ఓవర్లలో 254-4 వద్ద ఉన్నప్పుడు వర్షం పడింది. దీంతో కాసేపు మ్యాచ్ ఆగిపోయింది. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో డక్‌వర్త్-లూయిస్ పద్ధతి ప్రకారం 46 పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించినట్టు అంపైర్లు ప్రకటించారు.సెంచరీతో జట్టుని గెలిపించిన ఇంగ్లండ్ కెప్టెన్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డుకు ఎంపికయ్యాడు. 5 వన్డే సిరీస్ లో భాగంగా మూడు వన్డేలు ముగిసే సరికి ఆస్ట్రేలియా (2-1)తో ఆధిక్యంలో ఉంది.కాగా నాలుగో వన్డే లండన్ వేదికగా శుక్రవారం(సెప్టెంబర్ 27)న జరగనుంది.

Next Story

Most Viewed