నన్ను నా భార్య ఇంట్లో నుంచి గెంటేసింది.. సతీమణిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన స్టార్ హీరో

by Kavitha |
నన్ను నా భార్య ఇంట్లో నుంచి గెంటేసింది.. సతీమణిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన స్టార్ హీరో
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత కాలంలో చాలా మంది సెలబ్రిటీలు చిన్న చిన్న విషయాలకే మనస్పర్థలు వచ్చి విడాకులు తీసుకుంటున్నారు. ఎన్నో సంవత్సరాలు కలిసి ఉండి విభేదాలతో విడాకులు తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా ఇప్పుడు ఓ తమిళ స్టార్ హీరో కూడా విడాకులు తీసుకుంటున్నారు. మరి ఇంతకీ ఆ స్టార్ హీరో మరేవరో కాదండోయ్ జయం రవి(Jayam Ravi). ఆయన 15 ఏళ్ల కాపురం తర్వాత తన భార్యతో విడాకులు తీసుకుంటున్నట్టుగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే విడాకుల గురించి జయం రవి ప్రకటించినప్పుడు, ఇద్దరూ పరస్పరం చర్చించుకుని ఈ నిర్ణయం తీసుకున్నారని చాలా మంది అనుకున్నారు. కానీ, ఆయన భార్య ఆర్తి(Aarti).. తన అంగీకారం లేకుండా తన భర్త విడాకుల ప్రకటన చేశాడంటూ ఇన్‌‌స్టా వేదికగా స్టేట్‌మెంట్ పెట్టి అందరినీ షాక్‌కు గురి చేసింది.

ఇదిలా ఉండగా.. తాజాగా జయం రవి తన భార్య ఆర్తి పై చెన్నై అడయార్ పోలీస్ స్టేషన్‌‌(Chennai Adyar Police Station)లో ఫిర్యాదు చేశారు.. ఆ ఫిర్యాదులో ఆమె తనను ఇంటి నుంచి గెంటి వేసినట్టు.. చెన్నైలోని ఈసీఆర్ రోడ్‌లోని ఆర్తి ఇంటి నుండి తన వస్తువులను తిరిగి ఇవ్వాలని పేర్కొన్నారు. కాగా జయం రవి 2009 లో ఆర్తిని పెళ్లి చేసుకున్నాడు. ఇక పెళ్లైనా ఇన్నేళ్లకి విడాకులు తీసుకోవడానికి కారణం జయం రవి ఒక సింగర్‌తో రిలేషన్‌లో ఉండటమే అని నెట్టింట ఓ పుకారు షికారు చేస్తోంది.

Next Story

Most Viewed