Hero Surya: హీరో సూర్య పేరుతో పవన్ కు క్షమాపణలు.. అందర్ని కన్ఫ్యూజ్ చేస్తున్న ఆ ట్వీట్?

by Prasanna |
Hero Surya:  హీరో సూర్య పేరుతో  పవన్ కు క్షమాపణలు.. అందర్ని కన్ఫ్యూజ్ చేస్తున్న ఆ ట్వీట్?
X

దిశ, వెబ్ డెస్క్ : హీరో కార్తీ 'సత్యం సుందరం' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో లడ్డూ మీద కామెంట్స్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ మాటలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఫైర్ అయ్యారు. లడ్డూ గురించి ఇష్టమొచ్చినట్టు కామెంట్స్ చేయడం మంచి పద్దతి కాదు .. లడ్డూను సెన్సిటివ్ ఇష్యూ అంటూ కార్తీ చాలా కామెడీ చేశారు. మీరు అంటే నాకు చాలా గౌరవం.. మీరు అన్న మాటలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయంటూ ఒక రేంజ్ లో విరుచుకూ పడ్డారు.

అయితే, కార్తీ పోస్ట్ క్షమాపణలు చెబుతూ ట్వీట్ పెట్టాడు .. ఇది పెట్టిన కొంత సేపటికి మరో ట్వీట్ వైరల్ అయింది. హీరో సూర్య పేరుతో ఎవరు ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో " తన సోదరుడు చేసిన తప్పునకు తాను కూడా క్షమాపణలు చెబుతున్నానని.. పవన్ కు మద్దతుగా మూడు రోజుల పాటు దీక్ష చేస్తానని " ఇది క్షణాల్లో చాలా వైరల్ అయింది.

దీనిలో ట్విస్ట్ ఏంటంటే.. ఆ ట్వీట్ అసలు సూర్య నుంచి వచ్చినట్టు లేదు. సూర్య అఫీషియల్ అకౌంట్ @Suriya_offl పేరుతో ఉంది. చివరి అక్షరం ఎల్ కి బదులు టి ఉండటంతో ఫేక్ అకౌంట్ అని అర్ధమైంది. నెట్టింట ఫేమ్ కోసమే ఇలా చేసినట్లు తెలుస్తుంది. ఇది చూసిన సూర్య ఫ్యాన్స్, నెటిజన్స్ ఫుల్ కన్ఫ్యూజ్ అవుతున్నారు.

Next Story

Most Viewed