Heavy Rain Alert:ఈ ఏడు జిల్లాల్లో నేడు అత్యంత భారీ వర్షాలు.. వాతావరణశాఖ హెచ్చరిక

by Jakkula Mamatha |   ( Updated:2024-09-25 03:54:13.0  )
Heavy Rain Alert:ఈ ఏడు జిల్లాల్లో నేడు అత్యంత భారీ వర్షాలు.. వాతావరణశాఖ హెచ్చరిక
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తున్నాయి. ఈ క్రమంలో మరో మూడు, నాలుగు రోజులు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ(Department of Meteorology) ఇది వరకు పేర్కొంది. ఈ నేపథ్యంలో నేడు(బుధవారం) ఏడు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు(Warning) జారీ చేసింది. మధ్య వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అయితే నిన్న(మంగళవారం) పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. దీంతో జనగామ జిల్లా దేవరుప్పలలో అత్యధికంగా 11.5 సెం.మీ వర్షపాతం నమోదు కాగా.. అత్యల్పంగా రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్‌లో 8.9 సెం.మీ వర్షపాతం నమోదు అయినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed