Kamala Harris: కమలా హ్యారిస్ పార్టీ ప్రచార కార్యాలయంపై కాల్పుల కలకలం

by Shamantha N |
Kamala Harris: కమలా హ్యారిస్ పార్టీ ప్రచార కార్యాలయంపై కాల్పుల కలకలం
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్ష అభ్యర్థులపై కాల్పుల ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ పార్టీ సమన్వయ ప్రచార కార్యాలయంపై గుర్తుతెలియని వ్యక్తులు తుపాకులతో విరుచుకుపడ్డారు. అరిజోనాలోని డెమొక్రటిక్ పార్టీ సమన్వయ ప్రచార కార్యాలయంపై అర్థరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. దీంతో కార్యాలయంలోని సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కార్యాలయం కిటికీల దగ్గర్నుంచి కాల్పులు జరిపినట్లు తెలిపారు. అర్థరాత్రి సమయంలో కార్యాలయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. "రాత్రిపూట కార్యాలయంలో ఎవరూ లేరు కానీ, ఈఘటన ఆ భవనంలో పనిచేసే వారితో పాటు సమీపంలోని వారి భద్రత గురించి ఆందోళన కలిగిస్తుంది" అని అధికారులు అన్నారు. ఇకపోతే, ఇలా కాల్పులు జరగడం ఇది రెండోసారి. సెప్టెంబర్ 16న అర్ధరాత్రి తర్వాత కూడా కిటికీ దగ్గర బుల్లెట్ల వర్షం కురిపించినట్లు అధికారులు తెలిపారు.

ట్రంప్ పై హత్యాయత్నం

డొనాల్డ్ ట్రంప్‌పై రెండోసారి హత్యాయత్నం జరిగిన కొద్దిరోజులకే ఈ ఘటన జరిగింది. నిందితుడు ర్యాన్ రౌత్ ని అధికారులు అరెస్టు చేశఆరు. ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌లోని గోల్ఫ్ క్లబ్‌లో నిందితుడ్ని సీక్రెట్ సర్వీస్ గమనించింది. సీక్రెట్ సర్వీస్ అతనిపై కాల్పులు జరిపిన తర్వాత రౌత్ కారులో పారిపోయాడు. ఆ తర్వాత ఛేజ్ చేసి నిందితుడ్ని అరెస్టు చేశారు. అంతకుముందు, పెన్సిల్వేనియా ర్యాలీలో ట్రంప్ పై హత్యాయత్నం జరిగింది. థామస్ మాథ్యూ క్రూక్స్ అనే యువకుడు కాల్పులు జరిపాడు. అధికారులు జరిపిన కాల్పుల్లో అతడు మరణించాడు. ఇకపోతే, ఎన్నికల బరిలో కమలా హారిస్‌ ముందంజలో ఉన్నారు. చికాగో విశ్వవిద్యాలయంలో ఎన్‌ఓఆర్‌సీ నిర్వహించిన సర్వే ఫలితాలు వచ్చాయి. పోల్ ప్రకారం.. ఆసియా అమెరికన్‌ ఓటర్లలో 66 శాతం మంది హారిస్‌కు మద్దతుగా ఉండగా.. కేవలం 28 శాతం మంది ట్రంప్‌నకు మద్దతుగా నిలిచారు.

Next Story

Most Viewed