- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MBBS Counselling: ఎంబీబీఎస్ విద్యార్థులకు శుభవార్త..నేడే తుది మెరిట్ జాబితా విడుదల..!
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ(Telangana) రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీబీఎస్(MBBS), బీడీఎస్(BDS) ప్రవేశాలకు సంబంధించి కౌన్సెలింగ్(Counselling) ప్రక్రియకు సమయం ఆసన్నమైంది. ప్రస్తుత విద్యా సంవత్సరం (2024-25)లో ఎంబీబీఎస్,బీడీఎస్‌లో కన్వీనర్ కోటా(Convenor Quota) సీట్ల కోసం నమోదు చేసుకున్న విద్యార్థుల ప్రొవిజినల్ జాబితా(Provisional List)ను కాళోజీ నారాయణ రావు హెల్త్ యూనివర్సిటీ(Kaloji Narayana Rao University Of Health) ఇవాళ విడుదల చేయనుంది.రేపు తుది మెరిట్ జాబితాను రిలీజ్ చేసి అదే రోజు నుంచి వెబ్ ఆప్షన్ల(Web Options) నమోదుకు అవకాశం కల్పించనున్నారు. ఈ మేరకు యూనివర్సిటీ వైస్ చాన్సలర్(VC) డాక్టర్ కరుణాకర్ రెడ్డి(Karunakar Reddy) మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.ప్రొవిజినల్ జాబితాపై ఏమైనా సందేహాలు ఉంటే ఈ రోజు సాయంత్రం 5 గంటల లోగా యూనివర్సిటీ వెబ్‌సైట్ ద్వారా తెలియజేయాలని తెలిపారు.గత విద్యా సంవత్సరానికి సంబంధించిన సీట్ల కేటాయింపు వివరాలు కాలేజీల వారీగా యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని,ఈ మేరకు వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియకు విద్యార్థులు సిద్ధంగా ఉండాలని డాక్టర్ కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు.