- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉండొచ్చు : ఇండీడ్ నివేదిక!
దిశ, సెంట్రల్ డెస్క్: కరోనా సంక్షోభం నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ ఉద్యోగాలకు డిమాండ్ పెరిగినట్టు ప్రముఖ జాబ్ సైట్ ఇండీడ్ నివేదిక వెల్లడించింది. అనేక కంపెనీల్లో ఉద్యోగాల తొలగింపు, వేతనాల కోత కారణంగా ఆన్‌లైన్ వ్యాపారానికి గిరాకీ పెరిగిందని, ఈ-కామర్స్ సంస్థలు ఎక్కువగా కొత్త నియామకాలు చేపడుతున్నట్టు నివేదిక పేర్కొంది. వీటిలో శాశ్వత ఉద్యోగాలతో పాటు, తాత్కాలికం కూడా ఉన్నాయి. గత వారాంతం అమెజాన్ సంస్థ తాత్కాలికంగా 20 వేల ఉద్యోగాలను కల్పించనున్నట్టు తెలిపింది. ఏడాది తర్వాత నైపుణ్యం కలిగిన వారిని శాశ్వత ఉద్యోగులుగా గుర్తిస్తామని స్పష్టం చేసింది. అలాగే, అన్ని రంగాల్లోనూ నష్టాలతో అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు క్షీణించినప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉండొచ్చని నివేదిక అంచనా వేసింది. కరోనా వ్యాప్తి ఉన్నప్పటికీ ఇతర దేశాలతో పోలిస్తే భారత్ పరిస్థితి ఉద్యోగులు, వేతనాల అంశంలో మెరుగ్గా ఉన్నట్టు ఇండీడ్ నివేదికలో పేర్కొంది. దేశీయంగా ఉద్యోగాల తొలగింపు, జీతాల కోత ఉన్నప్పటికీ కొత్త నియామకాలు అదే స్థాయిలో పెరిగిందని నివేదిక స్పష్టం చేసింది. అయితే, మార్చి తర్వాత లాక్‌డౌన్ ఆంక్షల నేపథ్యంలో కొంత మందగించిన విషయం నిజమే అని నివేదిక తెలిపింది. ఇక, రంగాల వారీగా చూస్తే..వైద్య, ఐటీ, మార్కెటింగ్ రంగాల్లో నియామకాలు పుంజుకున్నాయని, ఐటీ మేనేజర్ల నియామకాలు ప్రోత్సహకరంగా ఉన్నట్టు నివేదిక పేర్కొంది. కొన్ని రంగాలు మాత్రం కరోనా వల్ల భారీగా నష్టపోయాయి. దెబ్బ తిన్న రంగాల్లో.. గతేడాదితో పోలిస్తే 78 శాతం తగ్గినట్టు నివేదికలో తేలింది. పర్యాటక, ఆతిథ్య రంగాల్లో 77 శాతం నియామకాలు, ఆహార తయారీ రంగంలో 78 శాతం, శానిటేషన్ రంగంలో 74 శాతం వరకూ నియామకాలు తగ్గినట్టు నివేదిక వెల్లడించింది. ఇక, కరోనా దెబ్బకు కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వడంతో ఫిబ్రవరి నుంచి మే మధ్య ఈ విధానం 380 శాతం పెరిగినట్టు నివేదిక స్పష్టం చేసింది.