- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. లక్షా ఐదువేల కొత్త ఉద్యోగాలు
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా సమయంలో చాలా మంది నిరుద్యోగులుగా మారారు. ఇంజనీరింగ్ అయిపోయింది ఏదైనా మంచి కంపెనీలో జాబ్ సాధించాలని ఆశపడిన విద్యార్థుల ఆశలు అడియాశలు అయ్యాయి. చదువు అయిపోయి, ఉద్యోగం లేక చాలా మంది మానసికంగా కుంగిపోయారు. కరోనా సమయంలో చాలా కంపెనీలు కూడా ఉన్న ఉద్యోగులను తీసేయడం జరిగింది. కాబట్టి ఏ కంపెనీలు ఫ్రెషర్స్‌కు అవకాశం ఇవ్వలేదు. అందువలన చదువు అయిపోయిన చాలా మంది కరోనా సమయంలో నిరుద్యోగులుగా మిగిలి పోయారు.
అయితే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఐటీ కంపెనీలు తీపికబురును అందించాయి. టీసీఎస్, ఇన్‌ఫోసిస్, విప్రో దేశీయ అతిపెద్ద కంపెనీలు.. ఇప్పుడు ఫ్రెషర్స్ కోసం లక్షకు పైగా కొత్త ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకూ ముగిసిన త్రైమాసికంలో ఐటీ కంపెనీలు టీసీఎస్, ఇన్‌ఫోసిస్, విప్రోం సంస్థలు రూ.17,446 కోట్ల లాభాలను ఆర్జించాయి. దీంతో ఈ ఏడాదిలో దాదాపు లక్షా ఐదువేల మంది ఫ్రెషర్లకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని హామీ ఇస్తున్నాయి. జూన్ త్రైమాసికంలో విప్రో కంపెనీ ఆదాయం 12 శాతానికి పెరగడంతో.. విప్రో కంపెనీలోనే 30 వేల మందికి ఉద్యోగ అవకశాలు కల్పిస్తామని తెలిపింది.