- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాట్సాప్ యూజర్లకు బిగ్ న్యూస్.. న్యూ ఫీచర్‌తో ఇంటికే నిత్యవసర సరుకులు!
దిశ, డైనమిక్ బ్యూరో : వాట్సప్ యూజర్లకు గుడ్ న్యూస్. సామాజిక మాధ్యమం వాట్సాప్ తన స్వరూపాన్ని మార్చేసుకుంటోంది. మొదట్లో సందేశాలు, ఫొటోలు, వీడియోలను మాత్రమే ఒకరికొకరు షేర్ చేసుకునే వెసులుబాటు ఉండేది. కానీ, ఇప్పుడు వాట్సాప్.. మరో రెండు, మూడు యాప్‌లు చేసే పనిని చేసేలా సరికొత్త రూపంలోకి మారిపోతోంది. ఇది వరకే మనీ ట్రాన్స్‌ఫర్ చేసేందుకు వీలుగా ఆప్షన్‌ను తీసుకొచ్చిన వాట్సాప్ ఇక నుంచి గ్రాసరీస్‌ను బుక్ చేసే విధంగా పలు ఆప్షన్లు తీసుకురానుంది.
దీనికోసం ముకేశ్ అంబానీ నేతృత్వంలోని జియోమార్ట్ సంస్థ వాట్సాప్‌తో అనుసంధానం అవ్వనుంది. నిత్యావసర సరకులు, కూరగాయలను వాట్సాప్ నుంచే ఆర్డర్ చేస్తే డెలవరీ చేసే విధంగా చర్యలు తీసుకోనుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు పోటీ ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే కనీస ఆర్డర్ నిబంధన కూడా లేకుండానే ఉచితంగా డెలివరీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వాట్సాప్ నుంచే తమ జియో రిచార్జ్‌ను చేసుకునే విధంగా కొన్ని మార్పులు తీసుకురానుంది. ఈ ఫీచర్స్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు రిలయన్స్ జియో, మెటా ప్రకటించాయి.
- Tags
- jiomart