- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరో భారీ ఒప్పందానికి సిద్ధమవుతున్న జియో!
దిశ, వెబ్‌డెస్క్: రిలయన్స్ జియోలో మరో సంస్థ భారీ పెట్టుబడులకు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే మూడూ భారీ ఒప్పందాలతో దూసుకెళ్తున్న రిలయన్స్ నాలుగో సంస్థతో ఒప్పందానికి సిద్ధమవుతోందనే వార్తలు మార్కెట్ వర్గాల్లో వినిపిస్తోంది. పెట్రో కెమికల్స్ వ్యాపార కార్యకలాపాలను విస్తరించేందుకు ముఖేశ్ అంబానీ సుమారు రూ. 24 లక్షల కోట్ల విలువైన ఒప్పందాన్ని చేసుకోనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. సౌదీ అరేబియా పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్(పీఐఎఫ్), రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ జియో ప్లాట్‌ఫామ్స్‌లో మైనారిటీ వాటాను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తోందని సమాచారం.
అలాగే, ఎయిర్ బీఎన్‌బీ, ఉబర్ టెక్నాలజీస్ సంస్థలకు నిధులను సమకూర్చిన అమెరికా పెట్టుబడుల సంస్థ జనరల్ అట్లాంటిక్, జియో ప్లాట్‌ఫామ్‌లో సుమారు రూ. 68 వేల కోట్ల నుంచి రూ. 75 వేల కోట్ల పెట్టుబడుల గురించి చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నెలలోనే ఈ ఒప్పందం ఖరారు అవ్వొచ్చని భావిస్తున్నారు. ఈ అంశంపై రిలయన్స్ ఇండస్ట్రీస్, సౌదీ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. జనరల్ అట్లాంటిక్ సంస్థ దీనిపై స్పందించడానికి నిరాకరించింది. ఇటీవల రిలయన్స్ జియోలో.. ఫేస్‌బుక్, సిల్వర్ లేక్ పార్ట్‌నర్స్, విస్తా ఈక్విటి పార్ట్‌నర్స్ 10 శాతం వాటాను కొనుగోలుతో సుమారు రూ. 60,596 కోట్ల పెట్టుబడులను స్వీకరించినట్టు రిలయన్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.