10 నిమిషాల్లో రూ. 854 కోట్లు సంపాదించిన ఇండియన్!

by Harish |
Rakesh Jhunjhunwala
X

దిశ, వెబ్‌డెస్క్: భారత స్టాక్ మార్కెట్ల బిగ్‌బుల్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా మరోసారి వందల కోట్ల లాభాలతో మరోసారి వార్తల్లో నిలిచారు. స్టాక్ మార్కెట్లపై పట్టు సాధించిన ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది అనూహ్యంగానే ఉంటోంది. తాజాగా టైటాన్ కంపెనీకి చెందిన షేర్లు ప్రతికూలంగా ఉన్న కారణంగా చాలామంది వాటాలను విక్రయించారు. అయితే, రాకేష్ ఝున్‌ఝున్‌వాలా మాత్రం ఆయన వాటాను వదల్లేదు. టైటాన్ కంపెనీలో ఆయన 4.81 శాతం వాటా ఉంది. తాజాగా గురువారం నాటి ట్రేడింగ్‌లో టైటాన్ షేర్లు ఏకంగా 10.69 శాతం దూసుకెళ్లడంతో ఆయన సంపద రాకెట్‌లా దూసుకుపోయింది.

టాటా గ్రూపునకు చెందిన టైటాన్‌లో రాకేష్ ఝున్‌ఝున్‌వాలా, ఆయన భార్యకు కలిపి వాటా ఉంది. ఈ కంపెనీ షేర్లు భారీగా పుంజుకోవడంతో ఆయన సంపద ఏకంగా 10 నిమిషాల్లో రూ. 854 కోట్లు పెరిగింది. ఇటీవల సెప్టెంబర్ త్రైమాసికంలో ఆభరణాల తయారీ పరిశ్రమ మెరుగ్గా ఉందని, కొవిడ్‌కి ముందు నాటి స్థాయికి చేరుకున్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం పండుగ సీజన్ కావడంతో మరిన్ని అమ్మకాలు ఉంటాయనే అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలోనే టాటా గ్రూప్ కంపెనీ టైటాన్ ఈ త్రైమాసికంలో కొత్తగా 134 స్టోర్లను పెంచింది. దీంతో గురువారం ఈ కంపెనీ షేర్ భారీగా పుంజుకుంది. దీంతో రాకేష్ ఝున్‌ఝున్‌వాలా వాటా విలువ అమాంతం పెరిగింది.

Advertisement

Next Story

Most Viewed