ప్రధానిగా KTR.. జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Shyam |   ( Updated:2021-09-29 08:51:03.0  )
ప్రధానిగా KTR.. జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: 20 ఏళ్లలో దేశానికి కేటీఆర్ ప్రధాని కానున్నారని పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో కేటీఆర్ రెండు గంటల స్పీచ్‌కే బీజేపీ- కాంగ్రెస్ నేతలు ఉలిక్కి పడుతున్నారన్నారు. అనర్గళంగా.. అంశాలతో మాట్లాడే వ్యక్తి కేటీఆర్ ఒక్కరేనని తెలిపారు. నాగార్జున సాగర్ లో పట్టిన గతే హుజురాబాద్‌లో కాంగ్రెస్‌కు, బీజేపీకి పట్టబోతోందని జోస్యం చెప్పారు. బండి సంజయ్ కు ప్రతి రోజూ బహిరంగ లేఖలు రాయనున్నట్లు స్పష్టం చేశారు. టీఆర్ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశంతో కలిసి బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడారు. బండి సంజయ్ లేఖలు రాయాల్సింది సీఎం కేసీఆర్ కు కాదని, ప్రధాని మోదీకి అని సూచించారు. బండి పాదయాత్రకు ఆదరణ లేకపోవడంతో అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

బీజేపీ అంటే ప్రజలను పట్టి పీడిస్తన్న బడా జలగల పార్టీగా మారిందని దుయ్యబట్టారు. శ్రీకాంతాచారి ఆత్మహత్యకు కారణం చంద్రబాబు- రేవంత్ రెడ్డి కాదా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి నిరుద్యోగుల కోసం 65 రోజుల పాటు కార్యాచరణ అంటూ జుంగ్ సైరన్ అంటున్నారని, అది కల్లెక్షన్ సైరన్ అని ఆరోపించారు. మళ్లీ వసూళ్ల కోసమే ఈ కార్యాచరణ రూపొందించారని మండిపడ్డారు. ఆఖరి పోరాటం అంటున్నారని, ఇది రేవంత్ అజీర్తి పోరాటం, పదవీ ఆరాటం అన్నారు.

Advertisement

Next Story

Most Viewed