ఆ విషయం నన్ను బాధించింది -జేసీ ప్రభాకర్

by srinivas |
ఆ విషయం నన్ను బాధించింది -జేసీ ప్రభాకర్
X

దిశ, వెబ్ డెస్క్: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సోమవారం ఐదు గంటలకు తాడిపత్రికి వస్తున్నట్లు టీడీపీ నాయకులు తెలిపారు. కరోనా నుండి తేరుకొన్న తర్వాత తాడపత్రికి రావడం ఇదే మొదటిసారి. జేసీ ప్రభాకర్ రెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున తాడపత్రి చేరుకునే అవకాశాలు ఉండడంతో ముందస్తు జాగ్రత్త చర్యగా పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయనున్నారు.

ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ… తాడిపత్రి ప్రజల ఆశీర్వాద బలంతోనే కరోనా నుండి కోలుకున్నట్లు ఆయన వివరించారు. వివిధ కారణాలతో నియోజకవర్గ ప్రజలకు చాలా కాలం నుండి అందుబాటులో లేకపోవడం తనకు ఎంతో బాధ కలిగించిందని జెసి వాపోయారు. సోమవారం సాయంత్రం నుండి తాడిపత్రిలోని తన నివాస గృహంలో ప్రజలకు అందుబాటులో ఉంటానని జేసీ ప్రకటించారు.

Advertisement

Next Story