ప్రైవేట్ వ్యక్తి నా ఇంట్లో వీడియో తీశాడు: జేసీ

by srinivas |   ( Updated:2021-01-04 07:18:38.0  )
ప్రైవేట్ వ్యక్తి నా ఇంట్లో వీడియో తీశాడు: జేసీ
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రైవేట్ వ్యక్తి నా ఇంట్లోకి వచ్చి కెమెరాతో వీడియో తీస్తుంటే అతన్ని దూషించానని, కానీ పోలీసులను ఒక్కమాట అనలేదని జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఇవాళ ఉదయం తాడిపత్రికి వెళ్లాలని.. నేను ఇంట్లో నుంచి బయటకు వస్తుంటే పర్మిషన్ లేదని పోలీసులు అడ్డుకున్నారని, అదే సమయంలో కానిస్టేబుళ్లు నన్ను చేయిపట్టుకొని లాగితే.. నేను నెట్టేశానన్నారు. దీక్షా శిబిరానికి వెళ్లాలని ఎంత చెప్పినా వినకుండా నన్ను తోసేశారని, తమ ఇంటి చుట్టూ మొత్తం పోలీసులే మోహరించారన్నారు. పోలీసోళ్ల బలప్రయోగంలో మనం ఎంతటోళ్లము అన్న జేసీ.. తమకు వివిధ సెక్షన్ల కింద నోటీసులు ఇచ్చారని వెల్లడించారు. నా ఇంట్లో కెమెరాతో వీడియోలు తీసిన వ్యక్తిని ఇంకా తిడుతానన్నారు. సోమవారం ఓ న్యూస్‌ ఛానల్‌తో మాట్లాడుతూ జేసీ దివాకర్‌రెడ్డి ఈ విధంగా స్పందించారు.

Advertisement

Next Story

Most Viewed