‘మా కేసు మేమే వాదించుకుంటాం’.. జాతిరత్నాలు

by Shyam |   ( Updated:2023-10-10 16:53:12.0  )
Jathiratnalu
X

దిశ, సినిమా: గట్టిగా నవ్వుకోవాలనుందా? అయితే రెడీ అయిపోండి. మార్చి 11న థియేటర్స్‌లో నవ్వుల పండుగ సెలబ్రేట్ చేసుకునేందుకు ‘జాతిరత్నాలు’ వచ్చేస్తున్నారు. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధానపాత్రల్లో తెరకెక్కిన చిత్రాన్ని నాగ్ అశ్విన్ నిర్మిస్తుండగా.. లేటెస్ట్‌గా విడుదలైన ట్రైలర్ ఫుల్ ఆఫ్ కామెడీతో నిండిపోయింది. లేడీస్ ఎంపోరియం నడుపుకునే హీరో నవీన్.. హీరోయిన్‌ ఫరియా అబ్ధుల్లాను ప్రేమలో పడేసేందుకు లేడీస్ ఎంపవర్‌మెంట్ కోసం కృషి చేస్తున్నట్లు బిల్డప్ ఇవ్వడం, అనుకోకుండా ఓ కేసులో ఇరుక్కుని ముగ్గురు స్నేహితులు జైలుకు వెళ్లడం, నేరస్థులం కాదని ప్రూవ్ చేసుకునేందుకు అక్కడి నుంచి పారిపోవడం అన్నీ కూడా ఫన్నీగా ప్రెజెంట్ చేశాడు డైరెక్టర్ అనుదీప్ కేవీ. మొత్తానికి ‘జాతిరత్నాలు’ సినిమా అన్ లిమిటెడ్ ఫన్ ప్యాక్‌గా ఉండగా.. బ్రహ్మానందం ఈ సినిమాతో కమ్ బ్యాక్ ఇవ్వడం ఫ్యాన్స్‌కు కిక్ ఇస్తోంది. ట్రైలర్‌లో ఆయన ఇచ్చిన లాస్ట్ పంచ్ కేక! అంటున్న అభిమానులు.. సినిమా చూసేందుకు ఎగ్జైటింగ్‌గా ఉన్నామని చెప్తున్నారు.

Advertisement

Next Story