అతిపెద్ద ఆన్‌లైన్ స్టోర్‌ను ప్రారంభించిన యునిక్లో ఇండియా!

by Harish |
CEO Tomohiko Shi
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ అంతర్జాతీయ దుస్తుల రిటైలర్ స్టోర్ యునిక్లో తన అధికారిక ఆన్‌లైన్ స్టోర్‌ను ప్రారంభిస్తున్నట్టు సోమవారం ప్రకటించింది. సరికొత్త వెబ్‌సైట్, మొబైల్ అప్లికేషన్ ద్వారా అతిపెద్ద యునిక్లో స్టోర్ ద్వారా వినియోగదారులు దుస్తులను కొనుగోలు చేయవచ్చని కంపెనీ తెలిపింది. కరోనా ప్రతికూల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని దేశవ్యాప్తంగా ఉన్న తమ వినియోగదారులకు సురక్షితమైన, వేగవంతమైన షాపింగ్ అనుభవాన్ని అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

‘తమ వ్యాపారాన్ని ఆన్‌లైన్ విధానంలోకి విస్తరించడం సంతోషంగా ఉంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా భౌతికనా ఉన్న స్టోర్ల కంటే మెరుగైన, ప్రత్యేకమైన యునిక్లో షాపింగ్ అనుభవాన్ని అందిస్తాము. ప్రస్తుతం ఉన్న క్లిష్టపరిస్థితుల్లో అధిక నాణ్యత కలిగిన దుస్తులను సులభంగా అందుబాటులో ఉంచనున్నట్టు’ యునిక్లో ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టొమొహికో షి అన్నారు. కరోనా సమయంలో కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా గతేడాది అక్టోబర్‌లో యునిక్లో ఇండియా ‘షాపింగ్ ఫ్రమ్ హోమ్’ అనే వ్యూహాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీన్నే పూర్తిస్థాయి ఈ-కామర్స్ కార్యకలాపాలకు అనుగుణంగా నిర్మించినట్టు కంపెనీ వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed