- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరల్డ్ కప్ బిడ్ ఉపసంహరించుకున్న జపాన్
దిశ, స్పోర్ట్స్: 2023 మహిళల సాకర్ వరల్డ్ కప్ నిర్వహణ కోసం వేసిన బిడ్‌ను జపాన్ ఉపసంహరించుకుంది. జపాన్ ఫుట్‌బాల్ అసోసియేషన్ సోమవారం ఆన్‌లైన్ బోర్డ్ సమావేశాన్ని నిర్వహించి ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే జపాన్‌లో జరగాల్సిన ఒలింపిక్స్ ఏడాది పాటు వాయిదా వేశారు. ప్రస్తుత కరోనా నేపథ్యంలో స్పాన్సర్లు దొరకడం, బయో సెక్యూర్ స్టేడియంలో ఏర్పాటు చేయడం అసాధ్యంగా కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో ఆ మెగా టోర్నీ నిర్వహణ నుంచి తప్పుకోవడం మంచిదనే అభిప్రాయానికి వచ్చి ఆ నిర్ణయం తీసుకుంది. జూన్ 10న ఫిఫా అంచనా బిడ్లు తెరవగా తొలి స్థానంలో న్యూజిలాండ్-ఆస్ట్రేలియా సంయుక్త బిడ్, రెండో స్థానంలో జపాన్, మూడో స్థానంలో కొలంబియా నిలిచాయి. అయితే జపాన్‌లో మౌలిక సదుపాయాలు అద్భుతంగా ఉండటంతో దానికే నిర్వహణ కట్టబెడతారని అందరూ భావించారు. ఇప్పుడు అనూహ్యంగా ఆ దేశం తప్పుకోవడంతో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్, కొలంబియా మాత్రమే రేసులో మిగిలాయి. నిపుణుల అంచనాల మేరకు ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌కే నిర్వహణ అవకాశం దక్కుతుందని అంటున్నారు.