పనికిమాలిన సలహాలొద్దు.. మీడియాపై జాన్వీ కపూర్ ఫైర్

by Shyam |
పనికిమాలిన సలహాలొద్దు.. మీడియాపై జాన్వీ కపూర్ ఫైర్
X

దిశ, సినిమా: బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ముంబై సిటీలో తరుచుగా కనిపిస్తూనే ఉంటుంది. జిమ్, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో ఔటింగ్ టైమ్‌లో కెమెరాస్ తనను క్యాచ్ చేస్తూనే ఉంటాయి. అయితే లేటెస్ట్‌గా జాన్వీ తన తండ్రి బోనీ కపూర్‌తో ఎయిర్‌పోర్టులో కనిపించగా ఫాదర్-డాటర్ డుయోను కంబైన్డ్‌గా ఫొటో తీసేందుకు ట్రై చేసింది మీడియా. ఈ క్రమంలో బోనీ కపూర్‌ను మాస్క్ రిమూవ్ చేయాలని కోరారు. దీంతో ప్రొటెక్టివ్ డాటర్ అయిన జాన్వీ.. పాపరాజీస్‌పై ఫైర్ అయింది. ఇలాంటి పనికిమాలిన సలహాలు ఇవ్వకూడదని చెప్పింది. మాస్క్ తీస్తే ఏమీ కాదని కొందరు మాట్లాడగా.. ఈ టైమ్‌లో సేఫ్ కాదని, ఇలాంటి రాంగ్ అడ్వైజ్ ఇవ్వకూడదని కోరింది. కాగా ఫొటోగ్రాఫర్స్ చెప్పడంతో మాస్క్ తీసిన బోనీకి మళ్లీ మాస్క్ పెట్టిన జాన్వీని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. తండ్రి అంటే ఎంత ప్రేమ.. ఇలాంటి కూతురు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటున్నామని అంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed