ఫ్రంట్‌లైన్ వారియర్స్‌‌కు అండగా ఉండాలి

by Anukaran |   ( Updated:2020-07-19 05:27:02.0  )
ఫ్రంట్‌లైన్ వారియర్స్‌‌కు అండగా ఉండాలి
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా కట్టడికి పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు ప్రభుత్వం బాసటగా నిలవాలని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని.. ఒక్కొ కుటుంబానికి రూ. కోటి ఎక్స్ గ్రేషియాతో పాటు ఒకరికి ఉద్యోగం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కరోనా నియంత్రణకు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండ విధులు నిర్వహిస్తున్న వైద్యులు, నర్సింగ్ స్టాఫ్, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి అన్నారు. వారి త్యాగాన్ని ప్రభుత్వం గుర్తించాలని పవన్ కల్యాణ్ కోరారు.

Advertisement

Next Story