వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన జనసేనాని..Pawan Kalyan

by srinivas |   ( Updated:2021-09-29 00:41:09.0  )
వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన జనసేనాని..Pawan Kalyan
X

దిశ, వెబ్‌డెస్క్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రిపబ్లిక్ మూవీ ప్రమోషన్ భాగంలో చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆ మంటలు నేటికీ చల్లారలేదు. ఇప్పటికీ వైసీపీ, జనసేన పార్టీ మధ్యల మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. మరోవైపు పవన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేసినందుకు గాను నటుడు పోసాని కృష్ణమురళిపై వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.

ఈ క్రమంలోనే జనసేన అధినేత వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కొత్త ప్రణాళికలు రచిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే బుధవారం గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి జనసేన అధినేత పవన్ హాజరుకానున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రధాన సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తోంది. అక్టోబర్ 2న చేపట్టే శ్రమదానం కార్యక్రమానికి సంబంధించి పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నట్టు సమాచారం.

Advertisement

Next Story