ఏపీ డీజీపీతో జనసేన పార్టీ నేతల భేటీ

by srinivas |   ( Updated:2021-03-09 09:15:27.0  )

దిశ, వెబ్ డెస్క్: ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను జనసేన పార్టీ నేతలు కలిశారు. రాష్ట్రంలో జనసేన పార్టీ కార్యకర్తలపై అధికార పార్టీ నేతలు దాడులకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదు చేశారు. జనసేన అభ్యర్థులను బెదిరించిన ఆధారాలను జనసేన నేతలు నాదెండ్ల మనోహర్, బోలిశెట్టి శ్రీనివాస్, గోవిందరావు, రాజబాబు డీజీపీకి సమర్పించారు. అనంతరం నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎన్నడూ లేని విధంగా క్షీణచిందని ఆరోపించారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అన్ని ప్రాంతాల్లో అధికార పార్టీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

జనసేన అభ్యర్థులను ఎన్నికల పోటీలో ఉండకూడదని బెదిరించారని అందుకు తగ్గ ఆధారాలను కూడా చూపించినట్లు తెలిపారు. మహిళలను కూడా ప్రచారానికి వెళ్లనీయకుండా ఇబ్బందులు పెట్టారంటూ ధ్వజమెత్తారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు అనవసరంగా ఘర్షణలు ప్రేరేపించారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అన్ని జిల్లాల్లో జరిగిన దాడులను డీజీపీకి వివరించామని తెలిపారు. జనసేన అభ్యర్థులకు పార్టీ అండగా ఉంటుందని నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed