- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రూ.5 వేలకే జన్ ఔషధి స్టోర్ మీ సొంతం
దిశ, వెబ్‌డెస్క్ : జనరిక్ మెడికల్ షాప్ ఏర్పాటు చేసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం భారీ ఆఫర్ ఇస్తోంది. కేవలం రూ.5వేల డిపాజిట్ చేస్తే రూ.1.5 లక్షల ఫర్నీచర్‌తోపాటు 100 శాతం రాయితీ ఇస్తోంది. నిరుద్యోగులు, ఎస్సీ, ఎస్టీలు సహా అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాటికితోడు మరో 10 వేల ప్రధాన మంత్రి జన్ ఔషధి కేంద్రాల ఏర్పాటు కేంద్రం ఈ రాయితీలను అందిస్తూ యువతను ప్రొత్సహిస్తోంది.
జన్ ఔషధి స్టోర్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం రూ.7 లక్షల సబ్సిడీ ఇస్తోంది. అయితే రూ.7 లక్షల రాయితీ కావాలంటే కేంద్రం సూచించిన జిల్లాలోనే స్టోర్ పెట్టాల్సి ఉంటుంది. కానీ స్టోర్ నిర్వాహకుడు తనకు నచ్చిన ప్రాంతంలో ఏర్పాటు చేసుకుంటే రూ.5లక్షల రాయితీని ఇస్తోంది. అలాగే మహిళలు, వికలాంగులు, ఎస్సీ, ఎస్టీలు జన్ ఔషధి కేంద్రాన్ని తెరిస్తే వారికి రూ.7 లక్షల రాయితీతోపాటు ఫర్నీచర్ సహా ఇతర ఖర్చుల కోసం రూ.1.5 లక్షల వరకు కేంద్రమే అందిస్తోంది. కంప్యూటర్లు, ప్రింటర్లు వంటి వాటి కోసం రూ.50 వేలు ఇస్తుంది. ఇక జన్ ఔషధి మెడిసిన్స్‌పై 20 శాతం కమిషన్ ఇస్తుంది. ఇదే కాకుండా ప్రతి నెలా అమ్మకాలపై 15 శాతం ప్రోత్సాహకం లభిస్తుంది. కాగా జన్ ఔషధి కేంద్రాల్లో మెడిసిన్స్ బయటి కన్నా 90 శాతం వరకు తక్కువ ధరకే లభిస్తాయన్న విషయం తెలిసిందే. ఇంకెందుకు ఆలస్యం వెంటనే దరఖాస్తు చేసుకుని స్టోరీని మీ సొంతం చేసుకొండి.