- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వివేక్ ధోవల్‌కు జైరాం రమేశ్ క్షమాపణలు..ఎందుకంటే
న్యూఢిల్లీ: పరువు నష్టం దావా కేసులో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ కుమారుడు వివేక్ ధోవల్‌కు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ క్షమాపణలు చెప్పారు. కారవన్ మ్యాగజైన్‌లో ప్రచురించిన ఆర్టికల్ ద్వారా జైరాం రమేశ్ విలేకరు సమావేశం పెట్టి వివేక్ ధోవల్, ఆయన కుటుంబ సభ్యులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు తన ప్రతిష్ఠకు భంగం కలిగించాయని మ్యాగజైన్‌తోపాటు జైరాం రమేశ్‌పైన వివేక్ ధోవల్ నేరపూరిత పరువునష్టం దావా కేసు వేశారు.
శనివారం ఢిల్లీ కోర్టు ఎదుట వివేక్ ధోవల్‌కు జైరాం రమేశ్ క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలు మిమ్మల్ని బాధించినందకు మీకు, మీ కుటుంబ సభ్యులకు క్షమాపణలు చెబుతున్నాను. తన పత్రికా సమావేశం ఏదైనా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటే వెంటనె తొలగించాని ఐఎన్‌సీ’ని ఆయన కోరారు. జైరాం రమేశ్‌ను వివేక్ ధోవల్ మన్నించడంతో కేసును మూసివేస్తున్నట్లు అదనపు చీఫ్ మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ సచిన్ గుప్తా తెలిపారు. కానీ, కరవన్ మ్యాగజైన్‌కు వ్యతిరేకంగా కేసు కొనసాగుతున్నది.