- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిన్ననాటి మిత్రునికి మేమున్నామంటూ..
దిశ, కరీంనగర్: చిన్ననాటి మిత్రుడి కుటుంబం కష్టాల్లో ఉండటం చూసి వారు తట్టుకోలేకపోయారు. బంధువులు, తెలిసిన వారు మాట సాయం తప్ప బాధిత కుటుంబాన్ని ఆదుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. మన ఆత్మీయులు కష్టాల్లో ఉన్నారంటే అటువైపు చూసేందుకు కూడా ధైర్యం చేయని రోజులివి. అలాంటిది ఇన్నిరోజులు తమతో కలిసి ఉన్న మిత్రుడు ఒక్కసారిగా తమను వదిలేసి దూరంగా వెళ్లిపోయాడని తెలిసినా, అతని కుటుంబం పడుతున్న ఇబ్బందులు చూసి చలించిపోయిన మిగతా స్నేహితులు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు.వివరాల్లోకివెళితే.. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామానికి చెందిన కల్లెడ రాజుకుమార్ ఈ నెల 6న రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో పెద్దదిక్కును కోల్పొయిన కుటుంబం అప్పటినుంచి పేదరికంతో కొట్టుమిట్టాడుతోంది. అది గమనించిన మృతుడి స్నేహితులు..చిన్నప్పటి నుంచి తమతో ఆడి, పాడిన వాడు ఇప్పడు లేడనే విషయాన్ని జీర్ణించుకోలేక పోయారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని నిర్ణయించుకుని, ఈ విషయాన్ని దేశ, విదేశాల్లో ఉన్న తోటి మిత్రులకు వివరించారు. స్కూలు టీచర్లు, గల్ఫ్ దేశంలో స్థిర పడ్డవారు, వివిధ పనులు చేస్తున్న వారంతా తమ వంతు సాయం అందించేందుకు చేతులు కలిపారు. రూ. 85వేలు జమ చేసి మంగళవారం బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. వీరి దాతృత్వాన్ని తెలుసుకున్న గ్రామస్తులు అభినందనలు తెలిపారు.