నాకు పీసీసీ ఇవ్వకుంటే.. ఆ పదవి ఇచ్చినా ఓకే : జగ్గారెడ్డి

by Shyam |
Congress MLA Jaggareddy
X

దిశ, తెలంగాణ బ్యూరో : టీపీసీసీ విషయంలో ఎవరి అభిప్రాయం వాళ్లు చెప్పొచ్చని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సమయం, సందర్భం వచ్చినప్పుడు అన్ని విషయాలు మాట్లాడతానని అన్నారు. ఎవరికి టీపీసీసీ ఇచ్చినా కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్‌గాంధీ నాయకత్వంలోనే పని చేస్తామని తెలిపారు. అయితే కాంగ్రెస్​ పార్టీలో వీహెచ్‌ చాలా సీనియర్ నేత అని.. ఆయన ఆవేదన అర్థం చేసుకోవాలన్నారు. తనకు పీసీసీ ఇవ్వాలని సోనియాగాంధీకి ఇప్పటికే లేఖ రాశానని, పీసీసీ ఇవ్వకుంటే.. వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరుతున్నామని జగ్గారెడ్డి తెలిపారు.

Advertisement

Next Story