- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఈ తీర్పు ముందే ఊహించా.. హైకోర్టులో అప్పీల్‌కు వెళ్తా
దిశ, ఏపీ బ్యూరో: సీఎం వైఎస్ జగన్, వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డిలకు సీబీఐ కోర్టులో ఊరట లభించడంపై నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. సీబీఐ కోర్టు తీర్పుపై హైకోర్టులో అప్పీల్‌కు వెళ్లనున్నట్లు స్పష్టం చేశారు. వచ్చే వారంలో హైకోర్టులో అప్పీల్ చేస్తానని తెలిపారు. సీబీఐ కోర్టు తీర్పు ఇలాగే వస్తుందని తాను ముందే ఊహించానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆగస్టు 25న జడ్జి తన అభిప్రాయాన్ని వెల్లడించకముందే జగన్, విజయసాయిల బెయిల్‌ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లను కోర్టు కొట్టేసిందంటూ జగన్ మీడియాలో బ్రేకింగ్ వచ్చిందని గుర్తు చేశారు. ఆ రోజు జగన్ మీడియా ప్రకటించినట్లుగానే నేడు తీర్పు వచ్చిందని వ్యాఖ్యానించారు. ఈ కేసులో తాను గెలుస్తాననే నమ్మకం ఆనాడే కోల్పోయానని చెప్పుకొచ్చారు. సీబీఐ కోర్టులో తీర్పు తనకు అనుకూలంగా వస్తే జగన్, విజయసాయిరెడ్డిలు హైకోర్టుకు వెళ్లేవారని… ఇప్పుడు తాను హైకోర్టుకు వెళ్తానని..అక్కడా అనుకూలంగా తీర్పు రాకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తానని ఎంపీ రఘురామ చెప్పుకొచ్చారు.