జగన్ స్కెచ్.. చంద్రబాబుకు కుప్పం తలనొప్పి

by srinivas |
జగన్ స్కెచ్.. చంద్రబాబుకు కుప్పం తలనొప్పి
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం వైఎస్ జగన్ టీడీపీ కంచుకోటలను టార్గెట్ చేసారు. రాష్ట్రంలో టీడీపీకి బలమైన పునాదులు ఉన్నచోట అభివృద్ధి కార్యక్రమాలతో జనంలో అభిమానం చూరగొనే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీకి పట్టు ఉన్న ప్రాంతాలపై ఎక్కువ దృష్టి పెట్టినట్లు చెప్పకనే చెబుతున్నాయి ఆయన అడుగులు.

ఇక నియోజకవర్గంలో నాకు తిరుగులేదు అనుకునే ప్రతిపక్ష పార్టీ నాయకులకు కూడా ఇప్పుడు టెన్షన్ పట్టుకుంది. ఎందుకంటే ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ వలనే మొన్నటి ఎలక్షన్స్ లో ఘోరంగా ఓడిపోవాల్సి వచ్చిందని బయటకి అనకపోయినా ఇన్నర్ ఫీలింగ్ ఇదే. కొందరు బడా నేతలైతే పార్టీ మారేందుకు రెడీ రంగం కూడా సిద్ధం చేసేసుకుంటున్నారు.

జగన్ ఏకంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పాలించే కుప్పం సీటునే టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. కుప్పంలో అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేస్తున్నారు. చంద్రబాబు ఈ నియోజకవర్గానికి 35 ఏళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ దీనిని మున్సిపాలిటీ లిస్టులో చేర్చలేదు. జగన్ సీఎం అయిన 6 నెలల్లోనే కుప్పంను మున్సిపాలిటీగా చేసి పలు అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేసారు.

photo credits : wiki media commons

ఇప్పుడు జిల్లాలో మున్సిపాలిటీ గ్రేడింగ్ సంపాదించుకున్న ఏకైక పంచాయతీ కుప్పం అయిందంటే… జగన్ ఏ రేంజ్ లో కుప్పంపై దృష్టి సారించారో అర్ధం అవుతోంది. టీడీపీ హయాంలో రూరల్ అర్బన్ మిషన్ కింద విడుదలైన 30 కోట్ల రూ.లలో 18 కోట్లు ఇంకా బ్యాంకులోనే ఉండగా… ఆ నిధులను పట్టణంలో డ్రైనేజి, సిమెంట్ రోడ్ల నిర్మాణాలు చేపట్టింది వైసీపీ ప్రభుత్వం.

కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని 8 పంచాయితీలతో పాటు పట్టణంలో పారిశుధ్య పనులు కూడా ప్రారంభం అయ్యాయి. 25 వార్డులకు గానూ 10 వార్డుల్లో ఇంటింటికి చెత్త సేకరణ కార్యక్రమం కూడా మొదలైంది. నియోజకవర్గంలో జగన్ ప్రభుత్వం త్వరితగతిన అభివృద్ధి పనులు పూర్తి చేస్తోంది. రోజురోజుకీ ప్రజల్లో టీడీపీ పై అభిమానం సన్నగిల్లుతోందనీ… వచ్చే ఎన్నికల్లో కుప్పంలో మాదే గెలుపు అని ధీమా వ్యక్తం చేస్తున్నారు వైసీపీ శ్రేణులు.

Advertisement

Next Story