- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పవన్ అభిమానికి జగన్ సాయం
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అతను ప్రతిపక్ష నేత అభిమాని. ప్రస్తుతం ఆపదలో ఉన్నాడు. ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి వెంటనే స్పందించాడు. చికిత్స నిమిత్తిం రూ. 10 లక్షలు మంజూరు చేశారు. దీంతో ఆ ముఖ్యమంత్రిపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. పిఠాపురం నియోజకవర్గానికి చెందిన నాగేంద్ర అనే వ్యక్తి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అభిమాని. అయితే, ఇతను రక్త సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. అతనికి అత్యవసర చికిత్స చేయాల్సి వచ్చింది. ఈ విషయమై ఓ స్వచ్ఛంద సంస్ధ ట్వీట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లాడు. వెంటనే జగన్ రూ. 10 లక్షలు మంజూరు చేశారు. ఈ మేరకు సీఎంవో స్పెషల్ ఆఫీసర్.. సంబంధిత ఆస్పత్రికి ఎల్వోసీని అందజేశారు. వెంటనే నాగేంద్రకు స్టెమ్ సెల్ థెరపి చికిత్స అందించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకబడగా ఉంది. ఈ విషయాన్ని సీఎం అధికారులు తెలిపినట్లు సమాచారం.