- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అమరావతి రైతులకు జగన్ సర్కార్ తీపికబురు
దిశ, ఏపీ బ్యూరో: రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు జగన్ సర్కార్ తీపి కబురు చెప్పింది. రాజధాని రైతులకు ప్రభుత్వం చెల్లించాల్సిన వార్షిక కౌలు సొమ్మును విడుదల చేసింది. బుధవారం రూ.195 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ల్యాండ్ పూలింగ్‌లో భూములిచ్చిన రైతులకు వార్షిక కౌలు వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇప్పటికే కొందరు రైతులు కౌలు చెల్లించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
తమకు తక్షణమే కౌలు చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టులో విచారణ జరగకముందే ప్రభుత్వం కౌలు నిధులు విడుదల చేస్తూ జీవో జారీ చేసింది. గతంలోనూ అమరావతి రాజధాని ప్రాంత రైతులు కౌలు కోసం కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం కౌలు నిధులు విడుదల చేసింది. ఈసారి ప్రభుత్వం ముందే నిధులు విడుదల చేసింది.