పాలనపై జగన్ ఫోకస్.. ఏప్రి‌ల్‌లో వరుస పథకాలు అమలు

by srinivas |   ( Updated:2021-03-16 05:50:24.0  )
cm jagan
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ప్రస్తుతం ఎన్నికల సీజన్ నడుస్తోంది. ఇప్పటికే పంచాయతీ, మున్సిపల్, ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాయి. ఇక జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు మాత్రమే మిగిలాయి. రాష్ట్రంలో వరుసగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు బ్రేక్ లు పడ్డాయి. రెండు ఎన్నికల్లోనూ ప్రజలు వైసీపీకి బ్రహ్మరథం పట్టడంతో సీఎం జగన్ పాలనపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత పాలనపై ఫోకస్ పెట్టాలని నిర్ణయించుకున్నారు.

ఇందులో భాగంగా ఏప్రిల్ నెలలో వరుస కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం నాడు అధికారులతో జరిగిన సమీక్షలో కీలక ప్రకటనలు చేశారు సీఎం జగన్. ఏప్రిల్‌ 9న జగనన్న విద్యాదీవెన, 13న వలంటీర్లను సత్కరించే కార్యక్రమానికి సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఏప్రిల్‌ 16న రైతులకు వైఎస్సార్‌ సున్నావడ్డీ డబ్బులు… ఏప్రిల్‌ 20న రైతులు, డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు వైఎస్సార్‌ సున్నా వడ్డీ డబ్బులు… ఏప్రిల్‌ 27న జగనన్న వసతి దీవెన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.

అంతేకాదు ఇకపై ప్రతిరోజూ ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు వెళ్లాలని ఆదేశించారు. వలంటీర్లను సేవామిత్ర, సేవారత్న, సేవావజ్ర పేర్లతో సత్కరించాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. వలంటీర్లు అందిస్తున్న సేవలను ప్రతీ ఒక్కరూ గుర్తించాలన్నారు. వారికి సత్కారం చేయడం వల్ల మరింతగా సేవలు చేస్తారని జగన్ అభిప్రాయపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed