ఓటీఎస్‌ దెబ్బకు వన్‌టైమ్ సీఎంగా జగన్.. బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు 

by srinivas |   ( Updated:2021-12-07 06:52:25.0  )
bjp leader lanka dinakar
X

దిశ, ఏపీ బ్యూరో: ఓటీఎస్‌ దెబ్బకు వన్‌టైమ్ సీఎంగా జగన్ మిగిలిపోనున్నారని బీజేపీ నేత లంకా దినకర్ ఎద్దేవా చేశారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన సీఎం జగన్.. వన్ టైమ్ సెటిల్‌మెంట్‌తో పేద ప్రజల సొమ్మును కాజేసేందుకు తయారుగా ఉన్నారని విమర్శించారు. ప్రజాసంకల్పయాత్రలో రాష్ట్రంలోని పేదల ఇళ్ల పైన ఎన్ని రుణాలు ఉన్నా రద్దు చేస్తానని హామీ ఇచ్చి ఇప్పుడు ఆ హామీలను తుంగలో తొక్కారని మండిపడ్డారు.

ఎప్పుడో పుట్టిన పిల్లవాడికి అతని పెళ్లి సమయంలో బారసాల చేసినట్టు వైసీపీ ప్రభుత్వ పాలన తీరు ఉందని ఎద్దేవా చేశారు. ఓటీఎస్ ఐచ్ఛికం అనే వారు ఇష్టారాజ్యంగా బలవంతపు వసూళ్లు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. ఆస్తి హక్కు పత్రాల పైన హక్కుదారుల ఫోటో ఉండాలి కానీ జగన్ ఫోటో కాదని విమర్శించారు. రాష్ట్రంలో అందరి ఆస్తులకు ఆయనే హక్కుదారు కావాలనుకోవడం దుర్మార్గమని దినకర్ ఆక్షేపించారు.

Advertisement

Next Story