కిషన్ రెడ్డి బాధ్యతగా మాట్లాడాలి : జగదీష్ రెడ్డి ఆగ్రహం

by Shyam |   ( Updated:2021-11-30 04:40:43.0  )
jagadeesh-reddy 1
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర రైతాంగాన్ని కేంద్ర ప్రభుత్వం మోసాగించే ప్రయత్నం చేస్తుందే తప్ప రాష్ట్రానికి మేలు చేసిందేమీ లేదని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. మంగళవారం శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ నేతలు ప్రెస్ మీట్‌లో చెప్పిందే చెప్పారు తప్ప కొత్తగా చేసిందేమీ లేదన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. భాష గురించి చెప్తే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుందన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి బాధ్యతాయుతంగా మాట్లాడలేదు.. రాష్ట్రం నుండి ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించడంలేదన్నారు.

దేశంలో ఎక్కడా లేని పథకాలు సీఎం కేసీఆర్ ఇక్కడ ప్రవేశపెట్టారు. మాటలు కాదు చేతలు కావాలన్నారు. కేంద్రం ఎన్ని టన్నుల ధాన్యం చెప్పకుండా కిషన్ రెడ్డి ఏదేదో మాట్లాడుతున్నారని ఎద్దేవ చేశారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర మంత్రులు మాట్లాడాలన్నారు. తెలంగాణలో వరి ధాన్యం దిగుబడి పెరిగిందని తెలిపారు. 2014 తరువాత తెలంగాణ ఎంత అభివృద్ధి చెందిందో తెలుసుకోవాలని అన్నారు. 2014 ముందు కేసీఆర్ లేడు.. తెలంగాణ రాష్ట్రం లేదు. 2014 తరువాత కేసీఆర్ వచ్చాడు.. ఇంత అభివృద్ధి అభివృద్ధి జరిగిందని అన్నారు. చిల్లర మాటలు మాట్లాడేది మీరు అని ఫైర్ అయ్యారు. దేశ ప్రజలకు ఆహార భద్రత కల్పించే బాధ్యత మీది.. అది కాకుండా అడ్డదిడ్డంగా ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు.

Advertisement

Next Story

Most Viewed