- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
YOLO ఫౌండేషన్ లాంచ్ చేసిన బాలీవుడ్ హీరోయిన్
దిశ, సినిమా : బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ‘యూ ఓన్లీ లివ్ వన్స్(YOLO)’ ఫౌండేషన్‌ను లాంచ్ చేసింది. కొవిడ్ 19 చాలెంజింగ్ టైమ్స్‌లో దయార్ధ హృదయుల కథలు షేర్ చేసేందుకు, ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ అలాంటి కథలు క్రియేట్ చేసేందుకు ఈ ఫౌండేషన్ ముందుంటుందని తెలిపింది. సమాజంలోని వివిధ వర్గాలను ఆదుకునేందుకు పనిచేస్తున్న పలు ఎన్‌జీఓ సంస్థలతోనూ తమ ఫౌండేషన్ కలిసి పనిచేస్తుందన్న జాక్వెలిన్.. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఉన్నది ఒక్కటే జీవితం.. ఈ టైమ్‌లోనే ప్రపంచానికి మనం ఏం చేయాలనుకుంటున్నామో చేయాలని, ఎంతో కొంత మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నించాలని సూచించింది. ఫౌండేషన్‌ను ప్రారంభించేందుకు గర్వంగా ఫీల్ అవుతున్నానని తెలిపిన జాక్వెలిన్.. మీకు వీలైనంత కంట్రిబ్యూట్ చేసి, ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సాయపడాలని అభిమానులను, ఫాలోవర్స్‌ను కోరింది.