రాజ్‌ఘాట్ సందర్శకుల పుస్తకంలో ఏం రాశాడు?

by Shamantha N |   ( Updated:2020-02-25 02:53:42.0  )
రాజ్‌ఘాట్ సందర్శకుల పుస్తకంలో ఏం రాశాడు?
X

దిశ, వెబ్‌డెస్క్ : గుజరాత్‌లో సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించి అక్కడి విజిటర్స్ బుక్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్న అభిప్రాయంపై వాదనలు జరిగాయి. సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించి ప్రపంచ దిగ్గజ నేతలకే ఆదర్శప్రాయుడైన మహాత్మా గాంధీ, ఆయన విలువల గురించి రాయకుండా.. మోడీ గురించి రాయడం చర్చనీయాంశమైంది. ఇదే నేపథ్యంలో ట్రంప్ రెండో రోజు పర్యటనలో ఢిల్లీలోని రాజ్‌ఘాట్ సందర్శించి మహాత్ముడి సమాధికి నివాళి అర్పించారు. సందర్శకుల పుస్తకంలో తన అభిప్రాయాన్ని పొందుపరిచారు. ఈ సారి ట్రంప్.. మహాత్ముడి ఆదర్శాల గురించి రాసుకొచ్చారు. అమెరికా ప్రజలు సార్వభౌమ దేశమైన భారత్‌‌, మహానేత గాంధీ సిద్ధాంతాలకు బలమైన మద్దతుదారులగా ఉంటారని పేర్కొన్నారు. రాజ్‌ఘాట్ సందర్శించడం తనకు దక్కిన గొప్ప గౌరవమని వివరించారు.

Advertisement

Next Story