- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
24 శాతం పెరిగిన ఐటీసీ ఆదాయం
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థ ఐటీసీ 2020-21 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన త్రైమాసికంలో నికర లాభాలు 1.3 శాతం క్షీణించి రూ. 3,748.4 కోట్లుగా వెల్లడించింది. కార్యకలాపాల ఆదాయం అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోలిస్తే 24 శాతం పెరిగి రూ. 14,157 కోట్లుగా ప్రకటించింది. ఈ ఏడాది మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కంపెనీ బోర్డు రూ. 5.75 తుది డివిడెండ్‌కు ఆమోదం తెలిపింది. కంపెనీ ప్రధాన విభాగం సిగరెట్ వ్యాపారం మెరుగ్గా ఉందని, 14.2 శాతం పెరిగి రూ. 5,859.60 కోట్లుగా రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.
అదేవిధంగా సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ వినియోగ వస్తువుల విభాగంలో ఆదాయం 15.8 శాతం పెరిగి రూ. 3,687.5 కోట్లుగా నమోదు చేసింది. అలాగే, వ్యవసాయ విభాగం అమ్మకాలు 78 శాతం పెరిగి రూ. 3,368.92 కోట్లుగా పేర్కొంది. మంగళవారం కంపెనీ త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో ఐటీసీ షేర్ ధర 0.3 శాతం తగ్గి రూ. 215.90 వద్ద ట్రేడయింది.