అంబులెన్స్‌లను ఆపడం దురదృష్టకరం.. సజ్జల

by srinivas |   ( Updated:2021-05-14 02:48:32.0  )
అంబులెన్స్‌లను ఆపడం దురదృష్టకరం.. సజ్జల
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ, ఏపీ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏపీకి చెందిన అంబులెన్స్‌లను తెలంగాణలోకి అనుమతించడం లేదు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సరిహద్దుల్లో అంబులెన్స్‌లను ఆపడం దురదృష్టకరమని అన్నారు. ఎవరికి వారు తమ వాళ్లను కాపాడుకునేందుకు ప్రతియత్నిస్తున్నారని చెప్పారు. ఇది మానవత్వంతో చూడాల్సిన అంశమని తెలిపారు.

తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలు మాకు ఇబ్బంది కలిగించడంలేదన్నారు. హైకోర్టు చెప్పినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం సాంకేతికంగా గైడ్‌లైన్స్ పెట్టిందని అన్నారు. తెలంగాణ సర్కార్ పెట్టిన గైడ్‌లైన్స్ పాటించడం కష్టమని తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో మౌళిక వసతులు అభివృద్ధి చెయలేదని విమర్శించారు. హైదరాబాద్ 2024 వరకు ఉమ్మడి రాజధానిగా ఉండాల్సింది. చంద్రబాబు రాష్ట్రానికి వచ్చేయడంతో మేము ఆ అవకాశాన్ని కోల్పోయామని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed