తప్పులేదని నిరూపించాల్సిన బాధ్యత కంపెనీదే: గౌతమ్ రెడ్డి

by srinivas |
తప్పులేదని నిరూపించాల్సిన బాధ్యత కంపెనీదే: గౌతమ్ రెడ్డి
X

విశాఖపట్నంలోని గోపాలపట్నం దగ్గర ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో జరిగిన స్టైరీన్ గ్యాస్ లీక్ ఘటనపై పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనపై సమాచారం అందినప్పటి నుంచి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని అన్నారు. కలెక్టర్ వినయ్ చంద్‌తో పాటు పరిశ్రమల శాఖాధికారులను కూడా అప్రమత్తం చేశామని చెప్పారు.

ప్రాణ నష్ట నివారణకు తీసుకోవాల్సిన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించామని అన్నారు. పరిశ్రమకు చుట్టుపక్కల గ్రామాలైన నరవ, ఆర్.ఆర్ పురం, టైలర్స్ కాలనీ, బి.సీ కాలనీ, బాపూజీనగర్, కంపరపాలెం, కృష్ణానగర్ తదితర ప్రజల సహాయార్థం హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేయాలని సూచించామని అన్నారు. ఆదేశాలప్రకారం బాధితుల సహాయార్థం డీడీ యస్ ప్రసాదరావును 799

7952301, 8919239341 నెంబర్‌తో పాటు ఐపీవో ఆర్.బ్రహ్మ 9701197069 నెంబర్లను కేటాయించామని చెప్పారు.

అధికారుల సూచనల నేపథ్యంలో ఉన్నపళంగా ఇళ్లను వదిలి వచ్చిన స్థానికులకు ఏ లోటు లేకుండా చూడాలని ఆదేశించామని అన్నారు. ప్రమాద సమయంలో పరిశ్రమలో 12 మంది ఉద్యోగులు ఉన్నారని, వారెవరికీ ప్రాణ నష్టం సంభవించలేదని గౌతమ్ రెడ్డి వెల్లడించారు. 200 మంది కెమికల్ వాయువు కారణంగా అస్వస్థతకు గురయ్యారని, వారందరికీ చికిత్సనందిస్తున్నామని ఆయన చెప్పారు.

పరిశ్రమలో ప్రమాణాలు వాడారా? లేదా? అన్న దానిని ఫోరెన్సిక్ విభాగం నిర్ధారిస్తుందని ఆయన చెప్పారు. ప్రమాదానికి బాధ్యత కంపెనీ వహించాల్సి ఉంటుందన్న ఆయన, కంపెనీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ఆ కంపెనీ అక్కడ దశాబ్దాలుగా ఉందని తెలిపారు. ప్రమాదం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆయన తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి స్థానిక ప్రజలను అధికారులు,యువత దూరంగా తరలించడం అభినందనీయమని ఆయన అభినందించారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని ఆయన వెల్లడించారు. స్టైరీన్‌కు విరుగుడు నీరని ఆయన అన్నారు. మున్సిపల్ అధికారులు నీటిని పిచికారీ చేయడంతో ప్రమాదం తప్పినట్టేనని ఆయన ప్రకటించారు.

Tags: styrene leak accident, vizag chemical accident, gas leak, rr venkatapuram

Advertisement

Next Story

Most Viewed