- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ రెండు ఉంటే.. రావొచ్చు.. పోవొచ్చు..
దిశ, ఆదిలాబాద్: కరోనా ప్రభావం క్రమంగా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో చిక్కుకున్న ఇతర రాష్ట్రాల ప్రజలు, వలస కూలీలు, టూరిస్టులు తిరిగి వెళ్లేందుకు నిబంధనలు సరళతరం అయ్యాయి. అయితే వారు సొంత రాష్ట్రాలకు వెళ్లేముందు వారికి మరోసారి ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు అన్ని అంతర్ రాష్ట్ర చెక్ పోస్టులలో ఆదివారం నుంచి ఆరోగ్య శిబిరాలు ప్రారంభించాలని ఆదేశాలు అందాయి.
ఆ తర్వాతే పాసులు జారీ..
అంతర్ రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద ఏర్పాటు చేయనున్న ఆరోగ్య శిబిరంలో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాతనే ఇతర రాష్ట్రాలకు ప్రయాణించేవారికి పాసులు జారీ చేయాలని, రెవెన్యూ, పోలీస్, ఆరోగ్య శాఖలు సంయుక్తంగా బృందాలుగా ఏర్పడి నిరంతరం ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని ఆదేశాలు అందాయి. ఇతర రాష్ట్రాలకు తిరిగి వెళ్లేవారు బృందాల్లో ఐదుగురి కన్నా ఎక్కువగా ఉండకుండా పాసులు జారీ చేయాలని, వాహనాలను కూడా అనుమతించాలని సూచించింది. వైద్య పరీక్షల సందర్భంగా ఎవరికైనా జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు కనిపిస్తే వారిని చెక్ పోస్ట్ వద్ద నిలిపివేయాలని, అలాగే ఎవరైనా రాష్ట్రంలోకి ప్రవేశించినా వారిలోనూ లక్షణాలు కనిపిస్తే రానివ్వకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.
పోలీస్ పాస్.. ఆరోగ్య ధృవీకరణ పత్రం..
అంతర్ రాష్ట్ర దారుల మీదుగా వెళ్లేవారు, వచ్చేవారు ఖచ్చితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకోవాల్సి ఉంటది. అలాగే పోలీస్ ధృవీకరణ పత్రం కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇది చెక్ పోస్టుల వద్ద పోలీస్ అధికారులు జారీ చేస్తారు. అలాగే అక్కడే వైద్య పరీక్షల అనంతరం ఆరోగ్య ధృవీకరణ పత్రాన్ని కూడా అందజేస్తారు. ఈ రెండు ఉంటేనే అటు నుంచి ఇటు… ఇటు నుంచి అటు వెళ్లే అంతర్ రాష్ట్ర ప్రయాణికులకు ప్రయాణించేందుకు అనుమతి ఉంటుంది.
మెమో జారీ… నేటి నుంచి అమలు..
కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన మేరకు ఆదివారం నుంచి అంతర్ రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద పోలీస్, ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మెమో జారీ చేసింది. మెమో నెంబరు 2260 ప్రకారం ఆదివారం నుంచి కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చేవరకు ఈ శిబిరాలు అమలులో ఉంటాయి. సిబ్బందిని మూడు షిఫ్ట్ లుగా విభజించి చెక్ పోస్టుల వద్ద నియమించి శిబిరాలు నిర్వహిస్తామని జిల్లా డీఎంహెచ్ వో డాక్టర్ వసంత రావ్ తెలిపారు.
Tags: adilabad, police pass, health certificate, check posts, interstate borders, migrant workers, travel