- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ధరణిలో ఈసీ కాపీ.. హద్దులు లేకుండానే జారీ
దిశ, తెలంగాణ బ్యూరో: ఎట్టకేలకు ధరణి పోర్టల్‌లో ఎన్కంబరెన్స్సర్టిఫికేట్పొందే ఆప్షన్వచ్చింది. ఏదైనా భూమిని ఎవరెవరు కొనుగోలు చేశారన్న విషయాన్ని ఇంటిగ్రేటెడ్ ల్యాండ్రికార్డ్స్మేనేజ్మెంట్సిస్టం నుంచి తీసుకోవచ్చు. మంగళవారం నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చారు. ధరణి పోర్టల్అందుబాటులోకి వచ్చిన గతేడాది 29 నుంచి నేటి వరకు ఎవరెవరి చేతులు మారిందన్న విషయాన్ని తెలుసుకోవచ్చు.
అంతకు ముందు వివరాలు కావాలంటే గతంలో మాదిరిగా https://registration.telangana.gov.in నుంచి డౌన్‌లోడ్‌చేసుకోవాలి. గతంలో మాదిరిగానే ఆస్తి వివరాలు, లావాదేవీ జరిగిన తేదీ, కొనుగోలు చేసిన వారు, విక్రయించిన వారు, ఎలాంటి డీడ్ద్వారా విక్రయించారు, సర్వే నంబర్లు, కొనుగోలు చేసిన విస్తీర్ణం, మార్కెట్‌విలువ, పట్టాదారు పాసు పుస్తకం నంబరు, డాక్యుమెంటు నంబరు, తహసీల్దార్‌కార్యాలయం వంటి అన్ని వివరాలను పేర్కొన్నారు. ఎన్నిసార్లు చేతులు మారిందో అన్ని వివరాలు ఇస్తున్నారు. అయితే హద్దుల వివరాలను పొందుపర్చకపోవడం కొంత అసౌకర్యానికి గురి చేసే అంశంగా కనిపిస్తోంది. ఈసీ కాపీలో హద్దులకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఆ వివరాలను కూడా నమోదు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పాత మ్యుటేషన్లకూ ఓకే
ఏనాడో సబ్రిజిస్ట్రార్కార్యాలయంలో సేల్డీడ్ద్వారా కొనుగోలు చేసిన భూములు ఉన్నాయి. అయితే కొందరు రెవెన్యూలో మ్యుటేషన్ చేసుకోకుండా పెండింగులో ఉంచారు. ధరణి పోర్టల్అమలైన తర్వాత వాటిని మ్యుటేషన్చేయించుకునేందుకు అవకాశం కల్పించారు. అలాంటి పాత మ్యుటేషన్ల వివరాలను కూడా ఎన్కంబరెన్స్సర్టిఫికేట్ల ద్వారా తెలుసుకునే అవకాశాన్ని కల్పించారు.
ఎవరి నుంచి ఎవరు కొనుగోలు చేశారు, ఎంత విస్తీర్ణాన్ని కొన్నారు, మార్కెట్‌ధరకు కొన్నారన్న వివరాలను చూడొచ్చు. కానీ ఇందులోనూ హద్దులు ఇవ్వలేదు. అలాగే ఏ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్చేసుకున్నారన్న విషయాన్ని మర్చిపోయారు. గతంలో ఎనీవేర్రిజిస్ట్రేషన్విధానం ద్వారా జిల్లాలోని ఏ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలోనైనా ఏ మండలానికి సంబంధించిన భూములనైనా డీడ్చేసుకునే వీలుండేది. దాని ద్వారానే లక్షలాది డీడ్స్అయ్యాయి. ఆ ఎస్సాఆర్వో వివరాలు నమోదు చేయడం ద్వారా భవిష్యత్తులోనూ సంబంధిత భూమి పూర్తి వివరాలను తెలుసుకునే వీలుండేదని రియల్టర్లు అభిప్రాయపడుతున్నారు.