- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వెంటిలేటర్లు, శానిటైజర్లు, మాస్క్ ల తయారీలో ఇస్రో
దిశ వెబ్ డెస్క్ :
కరోనా వైరస్‌ను నిరోధించడం కోసం తన వంతు సాయం అందించడానికి … భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సిద్దమైంది. రాకెట్ల తయారీని పక్కనబెట్టి వెంటిలేటర్ల డిజైనింగ్, శానిటైజర్లు, మాస్క్ ల తయారీపై ఫోకస్ పెట్టింది. దేశమంతా కరోనా కల్లోలంతో ఉండటంతో.. ప్రజలకు అవసరమైన పరికరాలను, మాస్క్ లను అందివ్వడానికి ఇస్రో ముందుకు వచ్చింది.
యావత్ ప్రపంచం కరోనా వైరస్‌తో యుద్ధం చేస్తోంది. మన దేశంలో కూడా కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం దేశమంతటా లాక్ డౌన్ విధించింది ఈ నిర్ణయం.. కొంతమేర కరోనా పాజిటివ్ సంఖ్య పెరగకుండా దోహదం చేసింది. భారత్ లో పరిస్థితి రెండో దశలో ఉంది. మూడో దశకు చేరుకోకముందే.
కేంద్రం, రాష్ట్రాలు వెంటిలేటర్లు, అత్యవసర వైద్య పరికరాలను సిద్ధం చేస్తున్నాయి. కరోనా సోకిన వారిలో ఎక్కువ మంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో.. ప్రభుత్వాలు భారీ సంఖ్యలో వెంటిలేటర్లకు ఆర్డర్ ఇచ్చాయి. ఈ నేపథ్యంలోనే పలు సంస్థలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భారత ప్రజలకు వెంటిలేటర్లు, ఫేస్ మాస్క్ లు, శానిటైజర్లను అందిస్తున్నాయి. తాజాగా.. వెంటిలేటర్లు, శానిటైజర్ల రూపకల్పన కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో రంగంలోకి దిగింది.
రాకెట్ల తయారీ పక్కనపెట్టి :
సులువుగా ఆపరేట్ చేసే వెంటిలేటర్లు, ఆక్సిజన్ కెనిస్టర్లు, మాస్కుల తయారీకి ఇస్రో తోడ్పాటునందిస్తుందని ఇస్రో సంస్థ డైరెక్టర్ ఎస్. సోమ్ నాథ్ వెల్లడించారు. విక్రమ్ సారభాయ్ స్పేస్ సెంటర్‌లో రాకెట్ల తయారీ కార్యకలాపాలను ఇస్రో తాత్కాలికంగా పక్కన పెట్టి వీటిని తయారు చేస్తోంది. ‘‘ మేం దాదాపు 1000 లీటర్ల శానిటైజర్లను తయారుచేశాం. మా ఉద్యోగులు మాస్కులను తయారు చేస్తున్నారు. మా కమ్యూనికేషన్స్ కంప్యూటర్లు అత్యంత సురక్షితమైనవి. అవసరమైతే మా ఉద్యోగులు ఇంటి వద్ద నుంచే పని చేస్తారు. అవసరమైనప్పుడు వీడియో కాన్ఫరెన్స్ లు పెడతాం.’’ అని సోమనాథ్ వెల్లడించారు. . కరెంట్ లేనప్పుడు కూడా సులభంగా ఆపరేట్ చేసేలా వెంటిలేటర్లకు డిజైనింగ్ చేస్తున్నామని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ సోమనాథ్ మీడియాకు తెలిపారు.. మరోవైపు డీఆర్‌డీవో కూడా కొద్ది వారాల వ్యవధిలోనే 30 వేల వెంటిలేటర్లను రూపొందించనుందని ఆ సంస్థ చీఫ్ డాక్టర్ సతీష్ రెడ్డి తెలిపారు.
Tags: corona virus, ventilaters, lockdown, isro, drdo, somanath, sanitizers, mask