- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
11రోజుల హింసకు తెర.. ఇజ్రాయెల్ హమాస్ కాల్పుల విరమణ
దిశ, వెబ్ డెస్క్ : ఇజ్రాయెల్, హమాస్ మధ్య గత పదకొండు రోజులుగా కాల్పులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఎట్టకేలకు ఇజ్రాయెల్, హమాస్ మధ్య కొనసాగుతున్న కాల్పులకు తెరపడింది. కాల్పుల విరమణ ఒప్పందానికి ఆమోదం తెలుపుతూ ఇజ్రాయెల్ మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. గత కొన్ని రోజులుగా ఈ రెండింటి మధ్య జరుగుతున్న హింసలో 200 మందికి పైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్‌లోనూ పదుల సంఖ్యలో ప్రాణనష్టం జరిగింది. హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై వందలాది రాకెట్లను ప్రయోగించగా, ఇజ్రాయెల్ గాజాను లక్ష్యంగా చేసుకుని వాయు దాడులకు దిగింది. ఈ ఘర్షణలో ఇరు దేశాల పౌరులు చనిపోయినప్పటికీ చాలా మంది పాలస్తీనియన్లు నిరాశ్రుయులయ్యారు. అలానే వేలాది మంది ప్రజలు గాజాను వదిలి వెళ్లిపోయారు.
ఇజ్రాయెల్, గాజాల మధ్య హింసాత్మక ఘర్షణల పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పెదవి విప్పారు. ఈ ఘటనలపై తీవ్ర ఆందోళనను వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ ప్రధానితో మాట్లాడుతూ కాల్పుల విరమణ విరమించుకోవాలన్నారు. దీంతో మిత్రదేశమైన అమెరికా నుంచి కూడా ఒత్తిడి తీసుకొచ్చింది. దాడులను తక్షణం ఆపేయాలంటూ ఇస్లామిక్ దేశాలు మొదటి నుంచే డిమాండ్ చేస్తున్నాయి. దీంతో ఇజ్రాయెల్‌పై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ అంగీకరించింది.