శ్రీశైల దేవస్థానానికి ఐఎస్‌వో గుర్తింపు

by srinivas |
శ్రీశైల దేవస్థానానికి ఐఎస్‌వో గుర్తింపు
X

దిశ, ఏపీ బ్యూరో: శ్రీశైల దేవస్థానానికి అరుదైన గౌరవం లభించింది. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్(ఐఎస్‌వో) గుర్తింపు లభించింది. భక్తులకు వైద్య, ఆరోగ్య పరంగా కల్పిస్తున్న సౌకర్యాలు, చేపడుతున్న రక్షణ చర్యలకుగాను శ్రీశైల దేవస్థానానికి ఈ గుర్తింపు లభించిందని ఐఎస్‌వో ఆక్యుపేషనల్‌ హెల్త్‌ అండ్‌ సేఫ్టీ మెజర్స్‌ (ఐఎస్‌వో–45001) ధృవీకరించింది. అలాగే క్షేత్రపరిధిలో పారిశుధ్య నిర్వహణ, కొవిడ్‌ నిబంధనల అమలు తదితర చర్యలకుగాను జీహెచ్‌పీ (గుడ్‌ హైజెనిక్‌ ప్రాక్ట్రీసెస్‌) ధృవీకరణ కూడా లభించింది. ఈ మేరకు ఐఎస్‌వో ప్రతినిధి ఎ.శివయ్య ధృవీకరణ పత్రాలను దేవస్థాన కార్యనిర్వహణాధికారి కేఎస్‌ రామారావుకు అందజేశారు. రాష్ట్రంలో జీహెచ్‌పీ ధ్రువీకరణ పొందిన తొలి ఆలయం శ్రీశైలం కావడం విశేషం.

Advertisement

Next Story