ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఐఎస్ఓ గుర్తింపు ..

by Shyam |
ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఐఎస్ఓ గుర్తింపు ..
X

నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఐఎస్ఓ గుర్తింపు లభించింది. నాణ్యతా ప్రమాణాలు పాటింపు, డిగ్రీ కళాశాలలో అమలవుతున్న విద్యా విధానంపై నిర్వహించిన ఓ సర్వేలో ఈ కళాశాలకు 2001 -2015 కాలానికి ఐఎస్ఓ గుర్తింపు లభించింది. ఈ మేరకు ప్రభుత్వ కళాశాలల విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ చేతుల మీదుగా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ భీమారావు గుర్తింపు పత్రం అందుకున్నారు. దీంతో తమపై మరింత బాధ్యత పెరిగిందని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో తమ కళాశాలలో చదివే విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తామన్నారు. తమ కళాశాలలో పనిచేస్తున్న ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్లు అంకితభావంతో పనిచేయడం వల్లనే ఈ గుర్తింపు సాధ్యమైందిని వివరించారు.కాగా డిగ్రీ కళాశాలకు ఐఎస్ఓ గుర్తింపు రావడం పట్ల విద్యార్థులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story