ధోనీ రిటైర్మెంట్ అవడానికి కారణం చెప్పిన ఇషాంత్

by Shiva |
ధోనీ రిటైర్మెంట్ అవడానికి కారణం చెప్పిన ఇషాంత్
X

దిశ, స్పోర్ట్స్ : మిస్టర్ కూల్‌గా పేరు తెచ్చుకున్న మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని 2014లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన సమయంలో టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తిన సంగతి తెలిసిందే. మెల్‌బోర్న్‌లో జరిగిన టెస్టు అనంతరం ధోనీ తన నిర్ణయాన్ని వెల్లడించాడు. ఆ రోజు ధోనీతో పాటు ఉన్న ఇషాంత్ శర్మ అప్పుడు జరిగిన సంగతులను గుర్తు చేసుకున్నాడు. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలు పంచుకున్నాడు.

‘మెల్‌బోర్న్ టెస్టు సందర్భంగా తాను విపరీతమైన మోకాలి నొప్పితో బాధపడ్డాను. ప్రతీ సెషన్‌లో ఇంజెక్షన్లు తీసుకొని బౌలింగ్ చేశా. నాలుగో రోజు ధోనీ దగ్గరకు వెళ్లి తాను ఇక బౌలింగ్ చేయలేనని చెప్పాను. సరే పర్వాలేదు అని చెప్పాడు. కానీ ధోనీ ఆ మ్యాచ్ తర్వాత రిటైర్ అవుతున్న విషయం నాకు తెలియదు. తన నిర్ణయం ప్రకటించిన తర్వాత నా దగ్గరకు వచ్చి నన్ను ఒంటరిగా వదిలేశామ్ అని అన్నాడు. కాకు చాలా బాధగా అనిపించింది. అయితే యువ క్రికెటర్లకు అవకాశాలు ఇవ్వాలనే ధోనీ తన రిటైర్మెంట్ ప్రకటించినట్లు నాలు అనిపించింది. తాను రిటైర్ అయితే సాహాకు అవకాశాలు వస్తాయని ధోనీ భావించాడు. అతడు ఇంకా ఆడితే 100 టెస్టుల రికార్డు అందుకునేవాడే. కానీ ధోనీ అలాంటి రికార్డులు పట్టించుకోలేదు. అతడు కచ్చితంగా దేశంకోసం ఆడే వ్యక్తి’ అని ఇషాంత్ చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story

Most Viewed