- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ధరణి : మరోసారి తెరపైకి చిరంజీవులు వ్యవహారం
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మాజీ ఐజీ, ఐఏఎస్ టి.చిరంజీవులు వ్యవహారం మరోసారి తెరపైకి వస్తుంది. వ్యవసాయేతర ఆస్తుల ప్రక్రియపై చిరంజీవులు ముందుగానే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. కొత్త విధానంతో చాలా ఇబ్బందులని, సాంకేతిక సమస్యలు ఉత్ఫన్నమవుతాయంటూ సూచించారు. దీనిపైనే ఇద్దరు ఐఏఎస్‌ల మధ్య గొడవకు దారి తీసింది. సీఎస్ సోమేశ్ కుమార్ తో విభేదించడంతోనే చిరంజీవులను పక్కనపెట్టినట్లు రూఢీ అవుతోంది. దీనిపై ఇప్పుడు ప్రభుత్వం పునరాలోచనలో పడింది. సీఎం కేసీఆర్ ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. సీఎస్‌పై ఆగ్రహానికి ఇదే ప్రధాన కారణంగా అధికారవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో చిరంజీవులు ఇచ్చిన నివేదిక మంచిదేనంటూ ఇప్పుడు చెప్పుకుంటున్నారు.
ఇప్పుడు ఫెయిల్ అయింది కదా..!
ధరణి పోర్టల్ –2 ఫెయిల్ అయింది. ఇది ప్రభుత్వ యంత్రాంగమే చెప్పుతున్న సత్యం. దీనిలో చాలా సాంకేతిక ఇబ్బందులు వస్తున్నాయి. నాలుగు నెలలుగా సాంకేతిక సమస్యలకు బ్రేక్ వేయడం లేదు. ధరణి పోర్టల్ 2 ద్వారా ఆస్తుల రిజిస్ట్రేషన్లు, ఆటోమెటిక్ మ్యుటేషన్ ప్రక్రియపై సబ్ రిజిస్ట్రార్లు ప్రయత్నాలు చేస్తున్నా ఫలించడం లేదు. ఇంకా గిఫ్ట్, మార్ట్ గేజ్, డెవలప్మెంట్, పార్టిషన్ డీడ్.. వంటి వాటి గురించి ఏం చేస్తారో తెలియడం లేదు. ఈ నేపథ్యంలో సబ్ రిజిస్ట్రార్లు, అధికారులు, ఉద్యోగులు మాత్రం ప్రభుత్వం ఎలా చెబితే అలా చేస్తామంటూ కూర్చున్నారు. పోర్టల్ లో సాంకేతిక లోపాలు ఉన్నా ఎదురు చెప్పేందుకు సాహసించడం లేదని తెలుస్తోంది. ఇప్పటికే ఈ శాఖ సరిగ్గా పని చేయడం లేదని, వీరందరినీ రెవెన్యూ శాఖలో విలీనం చేయాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఇప్పుడు ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చే పోర్టల్ ను వ్యతిరేకించడం ద్వారా ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందన్న భయం ఇంకా ఉంది.
తాజాగా సోమవారం నుంచి గందరగోళం మధ్య ఈ ప్రక్రియను ప్రారంభించారు. పాత విధానంలోనే రిజిస్ట్రేషన్లు చేయాలని హైకోర్టుకు విన్నవించి మార్పులు చేశారనే ఆరోపణలున్నాయి. స్లాట్లు బుక్ కావడం లేదు. ప్రస్తుతం కేవలం సేల్డీడ్కే పరిమితమైంది. మిగితా సేవలు ఏం జరుగడం లేదు.
అప్పుడేం చెప్పాం మరి…?
వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై ఆ శాఖ ముందు నుంచీ నివేదిక ఇస్తూనే ఉంది. కొత్త విధానంతో చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పుతూనే ఉంది. కానీ సీఎస్ మాత్రం సీఎంకు పక్కా హామీ ఇచ్చారు. ధరణిని విజయవంతం చేస్తామంటూ చెప్పుకుంటూ వచ్చారు. తీరా సమయానికి వ్యూహం బెడిసికొట్టింది. అంతకు ముందు ఈ వ్యవస్థపై అనుమానాలు చెప్తూ నివేదిక ఇచ్చిన ఐఏఎస్ అధికారి చిరంజీవులును ఆ శాఖ నుంచే తప్పించారు. కేవలం సీఎస్‌తో విభేదించినందుకే ఈ వేటు వేశారని చెప్పుతున్నారు. ఏవో కారణాలు చూపుతున్న ప్రధానంగా మాత్రం రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో క్షేత్రస్థాయి లోపాలను వివరించినందుకే వేటేసినట్లు స్పష్టమవుతోంది. సీఎస్ చెప్పినట్టుగా చేయాలనే హెచ్చరికలు ఇచ్చిన సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇందులో ముందు నుంచి రిజిస్ట్రేషన్ల శాఖ గత ఐజీ చిరంజీవులు వెల్లడించిన అంశాలే ముందున్నాయి. అవి చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని తీసుకువచ్చాయి.
తప్పుదారి పట్టించారా..?
ధరణి పోర్టల్ ద్వారానే ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ప్రభావం చూపినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మూడు నెలల నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఆగిపోవడంతో వాటిపై ఆధారపడిన వర్గాలన్నీ కుదేలయ్యాయి. ఈ అంశాన్ని సీఎం కేసీఆర్ కూడా గుర్తించారని అధికారులు చెప్పుతున్నారు. సాగు భూములకే పరిమితం కాకుండా కొత్తగా వ్యవసాయేతర ఆస్తులకు కూడా వర్తింపజేయడం వల్ల తీవ్రంగా నష్టపోయినట్లు పార్టీలోనూ చర్చ జరుగుతోంది. ధరణి పోర్టల్ అమలుకు తీవ్ర జాప్యానికి కారణమైన సీనియర్ ఐఏఎస్ అధికారులందరిపైనా సీఎం కేసీఆర్ మండిపడ్డారు.
అందుకే సీఎం సీరియస్
ఈ నేపథ్యంలో సీఎస్‌పై సీఎం కొన్ని రోజులుగా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు అధికారవర్గాల్లో చర్చ. సీఎస్ తీసుకునే నిర్ణయాలు, ఇచ్చిన నివేదికలతో ఒకదశలో రిజిస్ట్రేషన్ల శాఖపైనే సీఎం మండిపడ్డారు. ఆ శాఖ అనవసరమంటూ భావించారు. కానీ అవన్నీ సీఎస్ మెడకు చుట్టుకున్నాయి. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల అంశం ఇప్పుడు అతిపెద్ద సమస్యగా మారింది. దీంతో ప్రభుత్వం కూడా పునరాలోచనలో పడినట్లు చెప్పుతున్నారు. ఆ శాఖ ఐజీగా ఉన్నప్పుడు చిరంజీవి ఇచ్చిన నివేదికను మరోసారి పరిశీలించాలంటూ కొంతమంది ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.