హైదరాబాద్‌లోని ఆ ప్రాంతం రెడ్ లైట్ ఏరియాగా మారుతోందా..?

by Sumithra |   ( Updated:2023-09-01 12:13:47.0  )
హైదరాబాద్‌లోని ఆ ప్రాంతం రెడ్ లైట్ ఏరియాగా మారుతోందా..?
X

దిశ, వెబ్‌డెస్క్ : భిన్న సంస్కృతులు, విభిన్న ప్రాంతాలకు నెలవు హైదరాబాద్. ప్రపంచ ప్రఖ్యాత నగరాల్లో భాగ్యనగరం టాప్ 10 లో ఉందనడంలో సందేహం లేదు. హైదరాబాద్‌లో ప్రపంచ దేశాలతోపాటు భారత్‌లోని అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రజలు, ఉద్యోగులు నివసిస్తూ ఉంటారు. అయితే ఇంత ప్రసిద్ధిగాంచిన నగరంలో ఇటీవల వ్యభిచారం పెరిగిపోతోంది. గతంలో ఖరీదైన ప్రాంతాలు, హోటళ్లకే పరిమితమైన ఈ వ్యభిచారం ప్రస్తుతం శివారు ప్రాంతాలకు విస్తరించింది. మిడిల్ క్లాస్ పీపుల్స్, యూత్, చిరుద్యోగులు ఉండే ప్రాంతాల్లో విచ్చలవిడిగా సాగుతోంది. పోలీసులకు ఇటీవల తరచూ పట్టుబడుతున్న ఘటనలే దీనికి ఉదాహారణ.

హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురంలో గడిచిన రెండేళ్ల నుంచి వ్యభిచార దందా పెరిగిపోయింది. నేషనల్ హైవే 65, హైదరాబాద్- విజయవాడ రహదారిపై ఉన్న ఈ ప్రాంతంలో అత్యధికంగా మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు నివసిస్తుంటారు. అయితే ఈ ప్రాంతంలో గత కొన్నాళ్లుగా కొందరు వ్యభిచార ముఠాలుగా ఏర్పడి అమ్మాయితో వ్యాపారం చేస్తున్నారు. ప్రధానంగా విజయవాడ, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన యువతులను ఉద్యోగం పేరుతో, మహిళలను ఉపాధి పేరుతో తీసుకువచ్చి ఈ కూపంలోకి దించుతున్నారు. ఇళ్ల మధ్యలోనే త్రిఫుల్, డబుల్ బెడ్ రూం ప్లాట్లను అద్దెకు తీసుకుని ఈ దందాను నడిపిస్తున్నారు. మరికొందరు హోటళ్లలో రూంలను లీజుకు మాట్లాడుకుని యథేచ్ఛగా వ్యభిచారం చేయిస్తున్నారు.

ఇటీవల రాచకొండ పోలీసులు వరస దాడులు చేసి పదుల సంఖ్యలో యువతులు, మహిళలను వారి చర నుంచి కాపాడారు. విటులను జైలుకు తరలించారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన దంపతుల జంటలే ఈ వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఫ్యామిలీ అంటూ భార్యభర్తలతోపాటు వ్యభిచారం నిర్వహించే యువతులతో కలిసి ఇళ్లను అద్దెకు తీసుకుని ఈ సెక్స్ రాకెట్లను నడుపుతున్నారు. వీరికితోడు బీహార్, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన ముఠాలు కూడా ఆయా ప్రాంతాల యువతులతో ఈ పాడు పనులకు పాల్పడుతున్నారు. వనస్థలిపురం జాతీయ రహదారిపై ఉండడంతో వీరికి కలిసివస్తోన్న అంశం. డ్రైవర్లతోపాటు చిరుద్యోగులు, విద్యార్థులు సైతం ఈ వ్యభిచార గృహాలను ఆశ్రయిస్తూ.. పోలీసులకు చిక్కుతున్నారు.

నెల రోజుల క్రితం పోలీసులు చేసిన దాడుల్లో గుర్ఖాలాండ్, డార్జిలింగ్ ఏరియాలకు చెందిన యువతులు పట్టుబడ్డారు. ఇతర రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలు అయితే ఎక్కువ ధర వసూలు చేస్తున్నారు. యువతులకు ఓ రేటు, ఆంటీలకు మరో రేటు అంటూ ముఠా సభ్యులే ధర నిర్ణయించి విటుల నుంచి వసూలు చేస్తున్నారు. మహిళలకు రూ.500 నుంచి రూ.2000, యువతులకు రూ.1500 నుంచి రూ.5000, ఈశాన్య రాష్ట్రాల యువతులకు రూ.10 వేల వరకు రేట్లు ఫిక్స్ చేసి వసూలు చేస్తున్నారు. ఈ దందాను తెలిసిన విటులు, ఫేస్ బుక్, వాట్సాప్ ద్వారా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పట్టుబడిన ముఠా సభ్యులు, విటులపై కేసులు నమోదు చేస్తున్న పోలీసులు.. యువతులకు కౌన్సెలింగ్ ఇచ్చి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed