- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డేవిడ్ వార్నర్ కూడా వెళ్లిపోతున్నాడా?
దిశ, స్పోర్ట్స్: దేశంలో రోజుకు 3 లక్షలకు పైగా కోవిడ్ కేసులు నమోదవుతుండటంతో ఐపీఎల్ ఆడుతున్న కొంత మంది విదేశీ క్రికెటర్లు ఇంటి బాట పట్టిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా ప్రభుత్వం తాత్కాలికంగా భారత్ నుంచి వచ్చే విమానాలపై నిషేధం కూడా విధించింది. ఈ నేపథ్యంలో డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ కూడా ఐపీఎల్‌ను వీడతారనే వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ స్వస్థలాలకు వెళ్లడానికి క్రికెట్ ఆస్ట్రేలియాతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఒక వార్తా సంస్థ పేర్కొన్నది.
వచ్చే నెలలో ఆస్ట్రేలియా తమ సరిహద్దులను పూర్తిగా మూసి వేసి ఆరు నెలల పాటు విదేశాల నుంచి వచ్చే వారిని అనుమతి నిరాకరించనున్నదనే వార్తల నేపథ్యంలో వార్నర్, స్టీవ్ స్మిత్‌తో పాటు మరి కొందరు ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ లీగ్ విడిచిపెడతారనే వార్తలు వచ్చాయి. అదే జరిగితే ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు ఓడిపోయి పాయింట్ల పట్టికలో అట్టడుగు ఉన్న ఎస్ఆర్‌హెచ్‌కు పెద్ద ఎదురుదెబ్బే అని అనుకోవచ్చు. కాగా, డేవిడ్ వార్నర్ ఐపీఎల్ మొత్తానికి ఉంటాడని.. టోర్నీ ముగియక ముందు ఆస్ట్రేలియా తిరిగి వెళ్లే ఆలోచన లేదని హైదరాబాద్ జట్టు సన్నిహిత వర్గాలు చెప్పాయి.