- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యుత్ సంస్థల నష్టాలకు సీఎం కేసీఆరే కారణమా..?
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర సర్కార్వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను అందిస్తోంది. అయితే తెలంగాణలో వాడుకునే విద్యుత్‌లో సగానికి పైగా వ్యవసాయానికే వినియోగిస్తున్నారు. దీంతో డిస్కంలకు ఆదాయం తగ్గి, ఖర్చులు తడిచి మోపెడవుతున్నాయి. రాష్ట్రం మొత్తం వినియోగం 38,067.82 మిలియన్యూనిట్లు ఉంటే అందులో వ్యవసాయానికే 20,258.50 మిలియన్‌యూనిట్ల వాడకం జరుగుతోంది. మిగిలిన 17,809.32 మిలియన్ యూనిట్ల ద్వారా వచ్చే ఆదాయంతోనే విద్యుత్‌సంస్థల నిర్వహణ కొనసాగుతోంది. అందులో నుంచే వారికి వేతనాలు, ఇతర ఖర్చులను భరిస్తోంది. దీనికితోడు మొండి బకాయిలు పేరుకుపోవడంతో ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి సంస్థలను గట్టెక్కించడం యాజమాన్యానికి సవాల్‌గా మారింది.
2020-21 సంవత్సరానికి గాను తెలంగాణ వ్యాప్తంగా లో టెన్షన్‌లో భాగంగా జరిగే విద్యుత్వినియోగం 38,067.82 మిలియన్యూనిట్లుగా ఉందని డైరెక్టరేట్ఆఫ్ఎకనామిక్స్అండ్స్టాటిస్టిక్స్ద్వారా తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో 65 శాతానికి పైగా వాడకం వ్యవసాయానికే వినియోగిస్తున్నారు. కాగా గృహావసరాలకు వినియోగించే విద్యుత్12,832.77 మిలియన్ యూనిట్లుగా ఉంది. నాన్డొమెస్టిక్అయితే 2,831.23 మిలియన్యూనిట్లుగా పేర్కొంది. ఇండస్ట్రియల్‌కు 1,156.36, కాటేజ్ఇండస్ట్రీస్కు 43 మిలియన్యూనిట్లు, వీధి దీపాలకు 814.28 మి.యూ, సాధారణ అవసరాలకు 75.97 మి.యూ, టెంపరరీ అవసరాలకు 55.69 మి.యూ వినియోగిస్తున్నారు. ఈవీ చార్జింగ్స్టేషన్లు అత్యల్పంగా కేవలం 0.02 మిలియన్‌యూనిట్ల విద్యుత్‌ను మాత్రమే వినియోగిస్తున్నట్లు వెల్లడించింది.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి విద్యుత్వినియోగం రోజురోజుకూ భారీగా పెరుగుతోంది. 2014-15లో రాష్ట్రంలో కరెంట్వాడకం 39,519 మిలియన్యూనిట్లు ఉంటే క్రమంగా 2015-16లో 41,045 మి.యూ, 2016-17లో 44,783 మి.యూ, 2017-18లో 50,442 మి.యూ, 2018-19లో 57,454 మి.యూ, 2019-20లో 58,515 మి.యూ, 2020-21 మార్చి 31వ తేదీ నాటికి 57,007 మిలియన్‌యూనిట్ల విద్యుత్వినియోగం జరిగింది. అదే ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపు 65 వేల మిలియన్యూనిట్లకు పైగా చేరుకుంది.
తెలంగాణలో అన్ని రకాల విద్యుత్‌ప్లాంట్లు కలిపి 16,563 మెగావాట్ల కెపాసిటీని కలిగిఉన్నాయి. థర్మల్10,289 మెగావాట్లు, హైడల్2518 మెగావాట్లు, సోలార్, ఇతర నాన్కన్వెన్షనల్ఎనర్జీ సిస్టమ్స్ద్వారా 3755 మెగావాట్ల కెపాసిటీని కలిగి ఉన్నాయి. కాగా థర్మల్ద్వారా 47,604 మిలియన్‌యూనిట్ల విద్యుత్‌ఉత్పత్తి చేస్తున్నారు. 3424 మిలియన్‌యూనిట్ల జల విద్యుత్, సోలార్, విండ్నుంచి 6555 మిలియన్యూనిట్లు ఉత్పత్తి అవుతుండగా ప్రైవేట్వ్యక్తుల నుంచి 8972 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నారు.
ఇప్పటికే తెలంగాణలో విద్యుత్‌సంస్థలు తీవ్ర అప్పుల్లో కూరుకుపోయాయి. వాటి నుంచి ఎలా గట్టెక్కేదంటూ ప్రణాళికలు చేస్తున్నాయి. పెండింగ్విద్యుత్బకాయిల రికవరీకి అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు. కాగా అది సైతం అంతంతమాత్రమే సాగుతోంది. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి ఉచిత విద్యుత్అందిస్తోంది. దీనివల్ల సంస్థకు తక్కువ రెవెన్యూ వచ్చి నిర్వహణ భారం పెరిగిపోవడంతో డిస్కంల పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడినట్లయింది. ఈ స్థితి నుంచి సంస్థలు గట్టేక్కేందుకు యాజమాన్యాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.