శాఖాహార భోజన ప్రియులకు శుభవార్త చెప్పిన రైల్వే శాఖ

by Shamantha N |
train food serving
X

దిశ, వెబ్‌డెస్క్ : శాఖాహార భోజన ప్రియులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. రైలు ప్రయాణీకులకు త్వరలో సర్టీఫైడ్ శాఖాహార భోజనాన్ని అందించనున్నట్లు ప్రకటించింది. దేశా వ్యాప్తంగా ఉన్న ఆధ్మాత్మిక ప్రదేశాలకు వెళ్లే భక్తుల కోసం వందే భారత్‌తో పాటు మరో 18 రైళ్లలో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి రైల్వే తెచ్చింది. క్రమంగా అన్ని రైళ్లలోనూ ఈ విధానాన్ని అమలు చేసే దిశగా రైల్వే ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ శాఖాహార భోజన విధానాన్ని సాత్విక్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సర్టిఫైడ్ చేసిన తర్వాతనే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కోఆపరేషన్ (IRCTC) ఈ సేవలను ప్రారంభించింది. ప్రయాణికులకు శాఖాహారాన్ని అందించడానికి కేవలం ప్రయాణికుల అభిప్రాయాలను మాత్రమే పరిగణలోకి తీసుకోలేదని, ఆ శాఖలో పని చేసే ఏజెంట్లు, సబ్బులు అలాగే ఇతర వస్తువులను పరిశీలించాకే సర్టిఫికెట్ ఇచ్చామని ఆ సంస్థ పేర్కొంది.

ఈ సర్టిఫికేషన్ కేవలం రైళ్లల్లో మాత్రమే కాకుండా బేస్ కిచెన్‌లు, ఎగ్జిక్యూటివ్ లాంజ్‌లు, బడ్జెట్ హోటల్‌లు, ఫుడ్ ప్లాజాలు, ట్రావెల్ అలాగే టూర్ ప్యాకేజీలు, రైల్ నీర్ ప్లాంట్లు మొదలైన వాటికి కూడా ‘శాఖాహార స్నేహపూర్వక ప్రయాణాన్ని’ నిర్ధారించడానికి అని అధికారిక ప్రకటనలో తెలిపింది. సాత్విక్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ సర్టిఫైడ్ శాఖాహారాన్ని అందిస్తున్నందుకు సంతోషిస్తున్నామని బ్యూరో వెరిటాస్ నార్త్ జోన్ జనరల్ మేనేజర్ బ్రిజేష్ సింగ్ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed